రెండో సారి సర్జికల్ స్ట్రైక్ తో భారత్ .. పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. భారత్ యుద్ధ విమానాల బాంబుల దాడిని నిలువరించలేక తోక ముడిచింది. అయితే వైమానిక బృందం సోమవారం వేకువజామున మూడున్నర గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు ఉన్న లేజర్‌ గైడెడ్‌ బాంబులతో ఉగ్రక్యాంపులను ధ్వంసం చేసింది.ఈ దాడిలో జైష్ ఏ మొహమ్మద్ వంటి కీలక, అతిపెద్ద ఉగ్రవాద స్థావరం నాశనం అయింది. ఉగ్రవాద దాడుల నాశనం చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించిన లేజర్ గైడెడ్ బాంబుల ఖరీదు దాదాపు రూ.1.7 కోట్లు. పాక్‌లోకి దాడుల కోసం వెళ్లిన ఫైటర్ జెట్స్ సహా అన్నింటి విలువ రూ.2,568 కోట్లు.

 ఆపరేషన్ కోసం రూ.6,300 కోట్లు ఖర్చు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1000 కిలోల బాంబులు జారవిడిచి, ఉగ్రవాద స్థావరాలను సర్వనాశనం చేశారు. ఈ ఒక్కో బాంబు ఖరీదు రూ.56 లక్షలు. ఈ బాంబులను బాలాకోట్, ముజఫరాబాద్, చకోటీ ప్రాంతాల్లో జారవిడిచారు. ఈ దాడిలో 200 నుంచి 300 మంది తీవ్రవాదులు చనిపోయారు. కాగా, ఈ ఆపరేషన్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రూ.6,300 కోట్ల మిలిటరీ అసెట్స్‌ను ఉపయోగించింది. ఇందులో రూ.3,686 కోట్ల అసెట్స్ వినియోగించలేదు.

ఒక్కో మిగ్ 29ఎస్ విలువ రూ.154 కోట్లు

ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్) సర్వేలియెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్‌కు రూ.1750 కోట్లు అయ్యాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ వాయుదళాలపై కన్ను వేశాయి. ఇక, ఇల్యూషన్ మిడ్ ఎయిర్ రీఫిల్లింగ్ ట్యాంకర్ విలువ రూ.22 కోట్లు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరాన్ సర్వెలియన్స్ డ్రోన్ విలువ రూ.80 కోట్లు. ఇవి కూడా ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించాయి.  కానీ పైలట్లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఖరీదు మాత్రం వెలకట్టలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: