పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాదు.. ఈ విషయాన్ని ప్రపంచానికి వివరించి అన్ని దేశాల మద్దతు పొందడంలో ఇండియా ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ప్రత్యేకించి ప్రపంచ పెద్దన్న అమెరికా మద్దతును సంపాదించగలుగుతోంది. పుల్వామా దాడి జరిగిన వెంటనే అమెరికాకు విషయ తీవ్రతను చేరవేసింది.

సంబంధిత చిత్రం


అందుకే మొట్టమొదటిసారి 1971 తర్వాత భారత్ వైమానిక దళం పాకిస్తాన్‌లోకి వెళ్లి మరీ దాడులు చేసినా అమెరికా భారత్‌ కే మద్దతు పలుకుతోంది. తాజాగా అమెరికా మరోసారి పాకిస్థాన్ ను హెచ్చరించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను వెంటనే ధ్వంసం చేయాలని వార్నింగ్ ఇచ్చింది.

సంబంధిత చిత్రం


ఇప్పటికే పాకిస్తాన్‌కు ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేశామని..ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే చూస్తూ ఉరుకోబోమని గట్టి గా హెచ్చరించింది. ఇదే ఉదాసీన వైఖరి ఇక ముందు కూడా కొనసాగిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికా గట్టిగానే చెప్పింది.

america warns pakistan కోసం చిత్ర ఫలితం


మొదటి నుంచి పాకిస్తాన్ కు మిత్రదేశంగా ఉంటూ వచ్చిన అమెరికా.. ఆ దేశానికి ఏటా బిలియన్ల డాలర్లు సాయంగా పంపుతోంది. కానీ ట్రంప్ రాకతో ఈ వైఖరి మారింది. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఇటీవల ఆ సాయాన్ని నిలిపేశారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: