పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల మారణకాండకు భారత్ దీటుగా బదులిచ్చింది. 40 మంది సైనికుల త్యాగాలకు 350 మంది ముష్కరులను బలి ఇచ్చింది. ఈ దాడి ఒక్కరోజులో జరిగింది కాదు.. దీనికి పకడ్బందీ ప్రణాళిక ఉంది. పూల్వామా దాడి జరిగిన మరుసటి రోజే ఈ దాడికి ప్లాన్ మొదలైంది.

సంబంధిత చిత్రం


ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగితే... ఫిబ్రవరి 15 నే ఎయిర్‌ ఛీఫ్‌ మార్షల్‌ బీరేందర్‌ సింగ్‌ సర్జికల్ స్ట్రయిక్స్ 2 ఎటాక్ ప్లాన్ ను కేంద్రం ముందుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి అయిదు రోజులు ఎల్‌ ఓసీ వెంబడి హిరోన్‌ డ్రోన్‌లతో గగనతలం నుంచి పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు.

సంబంధిత చిత్రం


ఫిబ్రవరి 20 నుంచి రెండు రోజులు దాడి చేయాల్సిన లక్ష్యాలను నిర్ణయించారు. ఒకవైపు దాడి సన్నాహాలు చేస్తునే ఈ విషయాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోబల్‌కు వివరాలు అందించారు. ఫిబ్రవరి 22న దాడికి వెళ్లే బృందాలను సిద్ధం చేశారు.

india surgical strikes 2 కోసం చిత్ర ఫలితం


ఫిబ్రవరి 24న దాడులకు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. భటిండా నుంచి ఎర్లీ వార్నింగ్‌ జెట్‌, ఆగ్రా నుంచి గగనతలంలోనే ఇంధనం నుంచి విమానాలను పరీక్షించి చూశారు. ఫిబ్రవరి 25 అర్థరాత్రి నుంచి ఆపరేషన్ ప్రారంభమైంది. పకడ్బందీగా దాడి మొదలైంది. వ్యూహం ప్రకారమే భారత్ విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: