మన దాయాది ఉగ్రవాద దేశం స్వతహాగా పిరికిపంద. భారత్ తో ప్రత్యక్ష యుద్ధం చేసే శక్తి దానికి లేదు. కాది భారత్ అంటెస్ దానికి అసూయా ద్వేషాలత రగిలిపోతూ ఉంటుంది. దొగ యుద్ధాలు చేయటంలో ఘనాపాఠి. ప్రపంచానికే ఉగ్రవాదాన్ని సరపరా కేంద్రంగా నిలిచిపోయింది. ప్రపంచ వ్యాప్త వ్యతిరేఖత మూట గట్టుకుంటూ కూడా తనపై ఉగ్రవాద ముద్రపడ్దా కూడా భారత్ లోకి ఉగ్రవాద తండాలను జొప్పించి మనలను ఊపిరి సలపనివ్వకుండా చేస్తుంది.  
pak response to balkoT attack by india కోసం చిత్ర ఫలితం
పుల్వామా అమరవీరుల మరణాలు కలచివేయగా - ఇక ఏమాత్రమూ పాక్ ను క్షమించరాదన్న స్థితికి భారత్ చేరి పోగా బాలాకోట్‌ ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్లు ఈ సందర్భంగా భారత్‌ ప్రకటించడాన్ని నిన్న పాకిస్థాన్‌ తిప్పికొట్టింది. 
pak response to balkoT attack by india కోసం చిత్ర ఫలితం
అణ్వాయుధాల ప్రయోగాన్ని పరిశీలిస్తామన్న రీతిలో భారత్‌కు పాకిస్థాన్‌ నర్మగర్భ హెచ్చరికను చేసింది. పాకిస్థాన్‌ అణ్వాయుధ కార్యక్రమాలను పర్యవేక్షించే జాతీయ కమాండ్‌ అథారిటీ — ఎన్‌సీఏ బుధవారం సమావేశం కానుండడాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దేశ సైన్యం మీడియా వ్యవహారాల అధిపతి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ ఇందుకు సంబంధించిన వ్యాఖ్య చేశారు. 
pak response to balkoT attack by india కోసం చిత్ర ఫలితం
ఆయన విలేకరులతో మాట్లాడుతూ "మీకు ఆశ్చర్యం కలిగిస్తాం. ఆశ్చర్యం కోసం వేచి చూడండి. మా స్పందన వేరే విధంగా ఉంటుంది. చర్యలు కూడా వేరేగా ఉంటాయి. బుధవారం పార్లమెంటు సంయుక్త సమావేశం జరుగుతుంది. ప్రధాన మంత్రి ఎన్‌సీఏ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో పాకిస్థాన్‌ పౌర, మిలటరీ యంత్రాంగాలు నిర్ణయిస్తాయి. నిజానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి" అని చెప్పారు. భారత వాయు సేన సైనికులు మూడు మార్గాల్లో నియంత్రణ రేఖ దాటారని తెలిపారు. అన్ని చోట్లా పాక్‌ విమానాలు వాటిని తిప్పి పంపించాయని చెప్పారు.


*సరైన సమయం, సరైన ప్రదేశంలో భారత్ కు దీటైన జవాబిస్తామని స్పష్టం చేసింది.
*ఈ అంశాన్ని ఐరాసతో పాటు ఇతర అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతామని కూడా తెలిపింది.
*అణ్వాయుధాల ప్రయోగాన్నీ పరిశీలిస్తాం" అన్న రీతిలో 'నర్మగర్భ వ్యాఖ్యలు' చేసింది.


వైమానిక దాడుల తర్వాత కొన్ని గంటలకే ఇస్లామాబాద్‌లో దేశ అత్యున్నత భద్రతా సంస్థ, జాతీయ భద్రతా కమిటీ - ఎన్‌ఎస్‌సీ సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలంటూ సైనికదళాలకు, పాక్‌ ప్రజలకు ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 


మరోసారి తమ దేశంపై భారత్ కట్టుకథ అల్లి ప్రకటన చేసిందని ఎన్‌ఎస్‌సీ సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇది పాక్ పై దురాక్రమణ అని వ్యాఖ్యానించింది. ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించవచ్చని, క్షేత్రస్థాయిలో వాస్తవాలను చూడాలని ప్రపంచ మీడియాను ఆహ్వానించింది. భారత్‌లో ఎన్నికల వాతావరణం ఉన్న క్రమంలో ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను పణంగా పెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు విమర్శించింది. 
pak response to balkoT attack by india కోసం చిత్ర ఫలితం
నిన్నఉదయం 11 గంటలకు పార్లమెంటు సంయుక్త సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొంది. బుధవారం జాతీయ కమాండ్‌ అథారిటీ - ఎన్‌సీఏ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ప్రధాని నిర్ణయించారని, భారత బాధ్యతా రహిత విధానాన్ని ప్రపంచానికి తెలిపే దిశగా ఇమ్రాన్‌ ప్రపంచ దేశాల నేతలతో మాట్లాడు తున్నట్లు వివరించింది. పాక్‌ విదేశాంగ శాఖ భారత తాత్కాలిక హైకమిషనర్‌ను పిలిపించి, భారత యుద్ధ విమానాలు తమ ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించా యని నిరసన తెలిపింది. 
pak response to balkoT attack by india కోసం చిత్ర ఫలితం
ఒక ఆపరేషన్‌ సందర్భంగా భారత యుద్ధ విమానాలు నాలుగు బాంబులు జారవిడిచినట్లు పాక్‌ సైన్యం నిర్ధారించినా, దానిప్రాధాన్యాన్ని తగ్గించి చూపింది అదీ తన ప్రతిష్ట కాపాడుకోవటానికి తెలుకుట్తిన దొంగలా! భారత దాడిని తిప్పికొట్టామని, వారు తిరిగి వెళ్తూ, తమ పేలోడ్లను జారవిడిచారని పేర్కొంది. ఎన్‌ఎస్‌సీ సమావేశం అనంతరం రక్షణ,  ఆర్థిక మంత్రులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ మాట్లాడుతూ, భారత్‌ దురాక్రమణకు పాక్‌ దీటుగా బదులిస్తుంది అని అన్నారు. మంగళవారం తెల్లవారుజామున భారత యుద్ధవిమానాలు పలు విధాలుగా చొరబాటుకు యత్నించగా పాక్‌ యుద్ధవిమానాలు వాటిని నిమిషా ల వ్యవధిలో తిప్పిపంపినట్లు తెలిపారు.  
Shah Mehmood Qureshi - 2011 (cropped).jpg
బాలాకోట్‌ లో ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు లేవన్నారు. భారత యుద్ధవిమానాలు పాక్‌ గగనతలం లోపలికి మూడ్నాలుగు కిలోమీటర్లదాకా రాగా, పాక్‌ యుద్ధవిమానాలు ముందుకు సాగేందుకు యత్నించడంతో పేలోడ్‌ జారవిడిచాయన్నారు. పాక్‌ను తక్కువగా అంచనా వేయొద్దని భారత్‌ ను హెచ్చరించారు. పాక్‌ ఏం చేయాలో అది చేస్తుం దని, పాక్‌ ప్రజలను నిరాశ పరచదని స్పష్టంచేశారు. విలేకరుల నుంచి కఠినమైన ప్రశ్నలు ఎదురవ్వడంతో ఖురేషీ తన పాత్రికేయ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు తాజా పరిణామాలపై ఖురేషీ అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తోపాటు ఇతర విదేశీ దౌత్యవేత్తలతో మాట్లాడి పరిస్థితుల్ని వివరించారు. భారత్‌ దురాక్రమణకు ప్రతిస్పందించే హక్కు పాక్‌ కు ఉందన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: