ఒకవేళ భారత్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే!  కాంగ్రెస్ చేతి లో భారత్ సుభిక్షంగా ఉండగలదా?  ఇదిప్పుడు ప్రశ్నార్ధకమే! కాశ్మీర్  పితలాటకం జవహర్లాల్ నెహౄ,  భారత్ నడినెత్తిన రావణకాష్టంలా  భారం మోపారు. అభివృద్ధికి ప్రధాన ఆటంకంగా ఆర్టికిల్ 370 గుది బండను భారత్ మెడకు తగిలించారు. ప్రతి సంవత్సరం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం 130 కోట్ల భారత జనావళికి చెందిన ఆర్ధిక, రాజకీయ, సామాజిక సారాన్ని పీల్చి పిప్పిచేస్తుండగా ఆ ఉగ్ర రాజ్యం రాక్షసానందంతో ఊగిపోతుంది. ఎప్పటికైనా దీని అంతంచూడటం చరమగీతం పాడటం భారత్ కు అతి ముఖ్య అవసరం. 
article 35 A కోసం చిత్ర ఫలితం
ఆర్టికల్ 35 -ఏ మరియు ఆర్టికల్ 370 రెండూ ఆమోదించిన వ్యక్తి భారతీయుడేనా?  అనేది సంశయాస్పదం. ఒక భారతీయ పామరుడు సైతం ఈ దుర్మార్గపు చట్టాలను అనుమతించడు.  అలాంటిది భారత స్వాతంత్ర సమరయోధుడు ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహౄ చట్టం చేసి అనుమతించారంటే నాడు భారత్ అంత దయనీయ స్థితిలో ఉందా? నాటి భారత హోం శాఖా మాత్యులు, దేశంలోని లెక్కకు మిక్కిలిగా ఉన్న అనేక సంస్థానాలను భారత్ లో విలీనం చేసిన సమర్ధుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ గాని - విద్యావంతుడు భారత రాజ్యాంగ నిర్మాతల్లో మేటి వ్యక్తి డా. బీ ఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులు తిరస్కరించిన ఈ చట్టాలు జవహర్లాల్ కు చుట్టాలెలా అయ్యాయి. ఆయనలోని ఏ బలహీనత దీనికి పురిగొలిపింది. 
article 35 A కోసం చిత్ర ఫలితం
జమూ కాశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు, కొన్ని మినహాయింపులు కల్పించే ఆర్టికల్ 35-ఎ ఏకంగా రద్దుచేయాలని కోరుతూ దాఖలైన వివిధ పిటిషన్లపై గత  సోమవారం విచారణ ప్రారంభించిన సర్వోన్నత న్యాయస్థానం ఇందుకు షెడ్యూల్ నిర్ణయించింది. ఈ కేసులో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. 


ఆర్టికల్ 35-ఎ ప్రకారం జమ్మూ కశ్మీర్‌ లో స్థానికేతరులు ఎలాంటి స్థిరాస్తులు కలిగి ఉండటం, కొనుగోలు చేయడం కుదరదు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు కారు. అయితే, ఇది మహిళల పట్ల వివక్షత చూపేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. స్థానికేతరుడ్ని మహిళలు వివాహం చేసుకుంటే వీరు కూడా స్థానిక అర్హత కోల్పోతారు. 


కానీ, 2002 అక్టోబరు లో దీనిపై జమ్మూ కశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్ మహిళలు స్థానికేతరులను వివాహం చేసుకున్నా వారు స్థానికులుగా పరిగణించబడతారని స్పష్టం చేసింది. కానీ, వారి పిల్లలకు మాత్రం వారసత్వపు హక్కు ఉండదని తెలిపింది. 
article 35 A కోసం చిత్ర ఫలితం
అందుకే భారత్ నవనాడులను కుంగదీస్తున్న ఆర్టికల్ 35-ఎ లో కొన్ని సవరణలు చేయడానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇందుకు సంబంధించి సూచనప్రాయంగా తన అభిప్రాయాన్ని వెల్లడించడం తో సుప్రీం తీర్పు కీలకం కానుంది. 


దేశంలో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేకంగా పరిగణించే ఆర్టికల్ 35-ఎ రాజ్యాంగ విరుద్దమని పేర్కొంటూ 2014 లో ఒక ఎన్జీఓ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. దీన్ని ఆర్టికల్ 368 ప్రకారం సవరణ చేసి రాజ్యాంగంలో చేర్చవలసి ఉండగా అది జరగలేదని, పార్లమెంటులో దీనిని ప్రవేశపెట్టలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అలాగే గతేడాది జులైలో కశ్మీర్‌కు చెందిన ఇద్దరు మహిళలు సైతం దీనిపై కోర్టును ఆశ్రయించారు. తమ పిల్లలకు వారసత్వపు హక్కులను దూరం చేస్తోన్న ఆర్టికల్‌కు సవరణ లు చేయాలని పేర్కొన్నారు. 
article 35 A కోసం చిత్ర ఫలితం

దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలకు నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇది చాలా సున్నితమైన అంశమని, దీనిపై విస్తృత‌చర్చ జరగాలని కేంద్ర తరఫున హాజరైన సొలిసిటరీ జనరల్ కే కే  వేణు గోపాల్ ధర్మాసనానికి వివరించారు. 


జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సైతం ఫిబ్రవరి 11న సుప్రీంలో హాజరైంది. ఆర్టికల్ 35-ఎ పై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోడానికి తమకు అనుమతి ఇవ్వాలని, ప్రస్తుతం ఎన్నికైన ప్రభుత్వం లేదు కాబట్టి, విచారణను వాయిదా వేయాలని కోరింది. ఫిబ్రవరి 11 న జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది షోయబ్ ఆలమ్, వచ్చే విచారణ వాయిదా వేయాలని అభ్యర్థించారు.
article 35 A కోసం చిత్ర ఫలితం

మరోవైపు గత రెండు రోజులుగా కశ్మీర్ లోయలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీగా సైనిక బలగాలను మోహరించి, శ్రీనగర్‌‌లో 144సెక్షన్ అమలు చేసింది. ప్రభుత్వం తన వైఖరి మార్చుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలతో తీవ్ర భయాందోళనలు నెలకున్నాయి. 

article 35 A  కోసం చిత్ర ఫలితం

article 35 A  కోసం చిత్ర ఫలితం

ఏమిటీ అధికరణం 35ఏ?


జమ్మూ కశ్మీర్‌లో శాశ్వత నివాసులు అన్న పదాన్ని నిర్వచించడానికి, వారికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పించేందుకు ఆ రాష్ట్ర శాసనసభకు ఆర్టికల్‌ 35-ఏ అధికారం ఇస్తోంది. రాజ్యాంగ సవరణ లేకుండా, పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే 1954 లో ఈ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దీన్ని ఉపయోగించి శాసనసభ శాశ్వత నివాసులను నిర్ధారించింది.


దాని ప్రకారం 1911 కు ముందు జమ్మూ కశ్మీర్‌లో జన్మించిన లేదా స్థిరపడిన వారు లేదా అంతకు కనీసం పదేళ్ల ముందు ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొన్నవారు మాత్రమే శాశ్వత నివాసులు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌కు వచ్చిన వారెవరూ అక్కడ శాశ్వత నివాసులు అనకూడదు. ప్రభుత్వోద్యోగాలు చేయకూడదు. ఉపకార వేతనాలు, ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు అనర్హులు కాదు. ఓటు వేయకూడదు. ఎన్నికల్లో పోటీ చేయకూడదు.


శాశ్వత నివాసి అయిన కశ్మీరీ అమ్మాయి, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమెకున్న హక్కులు కూడా హరించుకుపోతాయి. కానీ కశ్మీరీ అబ్బాయిల విషయం లో ఇది వర్తించదు.  అయితే 2002 అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు కూడా హక్కులు ఉంటాయనీ, అయితే వారి పిల్లలకు మాత్రం ఏ హక్కులూ ఉండవని స్పష్టం చేసింది.

what is going to happen on article 35 A in SC కోసం చిత్ర ఫలితం

సుప్రీంకోర్టులో ఇలా కేంద్రం పిటిషన్‌

determine modi కోసం చిత్ర ఫలితం

ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించకుండా, పార్లమెంటులో చర్చించకుండా అధికరణం 35-ఏ ను రాజ్యాంగంలో చేర్చారనీ, కాబట్టి అది చెల్లదని ఢిల్లీకి చెందిన 'వి ద సిటిజన్స్‌' అనే స్వచ్ఛంద సంస్థ 2014 లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. అలాగే ఆర్టికల్‌ 35-ఏ తమ పిల్లలకు ఓటు హక్కు లేకుండా చేస్తోందని ఇద్దరు కశ్మీరీ మహిళలు గత నెలలో సుప్రీంను ఆశ్రయించారు.


ఎన్డీఏ ప్రభుత్వం దీనిపై కోర్టులో అఫిడవిట్‌ వేయకుండా, ఈ అంశంపై విస్తృత చర్చ జరగడంతోపాటు దీనిని రాజ్యాంగ ధర్మాసనం తేల్చాలని కోరుకోవడం మరింత వేడి పుట్టిస్తోంది. ఆర్టికల్‌ 35-ఏ పై చర్చ అంటే దాదాపుగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370 పై చర్చగానే భావించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం జమ్మూకశ్మీర్‌ కు కల్పించిన ప్రత్యేకహక్కులను ప్రశ్నించకుండా అధికరణం 35-ఏ  చెల్లుబాటును, రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రశ్నించలేమని చరిత్రకారుడు శ్రీనాథ్‌ రాఘవన్‌ అంటు న్నారు.
anupam kher on article 35 a కోసం చిత్ర ఫలితం
సినీ నటుడు అనుపమ్ ఖేర్ వంటి బీజేపీ అనుకూల బాలీవుడ్ నటులు, ప్రముఖులు 370, 35-ఎ అధికరణాలకు కాలం చెల్లిపోయిందని, వాటిని రద్దు చేయాల్సిందేనని వాదిస్తున్నారు. ఇటీవల జమ్ములో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు సమీక్షించాలని వ్యాఖ్యానించడం గమనార్హం. రాజ్యాంగ మౌలిక సూత్రాల ను కదిలించడం అంత తేలికేం కాదు. రక్షణ, హోం, ఆర్థిక వ్యవహారాలు మినహా అన్ని అంశాల్లోనూ నిర్ణయాధికారం జమ్ముకశ్మీర్ ప్రభుత్వానిదే.


అందుకోసమే కశ్మీర్ విలీన సమయంలో 370 అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చేందుకు షేక్ అబ్దుల్లా, పండిట్ నెహ్రూ హయాంలో అంగీకారం కుదిరింది. 1949లో భారత రాజ్యాంగంలో దీన్ని చేర్చారు. తర్వాత కశ్మీరీల ప్రత్యేక హక్కులపై రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో 35-ఎ అధికరణం ఏర్పాటు చేసేందుకు 1952లో నెహ్రూ, షేక్ అబ్దుల్లా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాతే జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటైంది. కొందరు జమ్ము కశ్మీర్ రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైన అధికరణాలు చెల్లుబాటు కావని కొత్తవాదం వినిపిస్తున్నారు.


జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌-370 అక్కడి శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులు ప్రసాదించే అధికరణం- 35ఏ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రత్యేక హక్కులను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం త్వరలో విచారించనుంది.

mahbooba కోసం చిత్ర ఫలితం

జమ్ము కశ్మీర్ మాజీ సిఎం మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ 35-ఎ అధికరణాన్ని కదిలిస్తే కశ్మీర్ లోయలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసేవారే ఉండరని హెచ్చరించారు. మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ మాత్రం బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా అధికారం లోకి వచ్చినప్పుడు 370, 35-ఎ అధికరణాల గురించి నిర్ణయం తీసుకుంటామని తేల్చేశారు. 370 అధికరణాన్ని రద్దు చేయాలని బీజేపీ తొలి నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: