పుల్వామా దాడికి ప్రతిదాడిగా నిన్న భారత వైమానిక దళాలు పాక్ ఆక్రమిత కాశ్మిర్ లో సర్జికల్ స్టైక్2 చేసిన విషయం తెలిసిందే.  ఈ దాడిలో ఉగ్రవాదులు 300 మందికి పైగా మరణించినట్లు భారత ప్రభుత్వం తెలిపింది.  ఈ ఘటనతో ఉగ్ర స్థావరాలన్ని నాశనం అయ్యాయి.  ముజఫర్‌బాద్‌, చికోటీ సహా సమీపంలోని జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసి భారత వాయుసేన సురక్షితంగా తిరిగొచ్చింది.
Image result for పాకిస్థాన్ ఫైటర్ జెట్స్
వాస్తవాధీన రేఖను దాటి పాక్ భూభాగంలో భారత వాయుసేన సర్జికల్ నిర్వహించగా విమానాలకు సమాచారం అందజేయడానికి ఈఎంబీ 145, ఐఎల్‌-78 కూడా వెళ్లినట్లు సమాచారం.  పాకిస్తాన్ ఆర్మీ అధికారి మాత్రం… పాక్ వైమానిక దళాలు స్పందించేలోపు భారత విమానాలు దాడులు చేసి వెనక్కి వెళ్లాయని చెప్పారు. అయితే తమపై జరిగిన దాడికి ప్రతి దాడి ఉంటుందని పాకిస్థాన్  అంటు ఉంది. 
Image result for పాకిస్థాన్ ఫైటర్ జెట్స్
తాజాగా రాజౌరీ సెక్టార్ లోకి చొరబడ్డ పాక్ యుద్ద విమానాలు. భారత్ భూభాగంలోకి పాకిస్థాన్ ఫైటర్ జెల్స్ ప్రవేవం. భారత సైన్యం కాల్పులతో తోక ముడిచిన పాక్ యుద్ద విమానాలు. భారత వైమానిక దాడిని జీర్ణించుకోలేక పోతున్న పాకిస్థాన్. కాసేపట్లో పాక్ పార్లమెంట్ సంయుక్త సమావేశం. పాక్ జాతీయ కమాండ్ అథారిటీ సమావేశం యాక్షన్ ప్లాన్ ఖారారు.  కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్థాన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: