పుల్వామా పై జరిగిన దాడికి ప్రతీదాడి చేసింది భారత్.  నిన్న తెల్లవారు జామునే ఎల్వోసీ వ‌ద్ద ఉన్న పాక్ ఉగ్ర‌శిబిరాల‌పై భార‌త వైమానిక ద‌ళం మెరుపు దాడి చేసింది.  ఈ దాడిలో 300 మంది ఉగ్ర‌వాదులు హతమయ్యారు.  భార‌త వైమానిక ద‌ళం ఎల్వోసీ వెంట ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌పై 21 నిమిషాల్లోనే దాడి చేసి మట్టుపెట్టింది. ఎల్వోసీ వ‌ద్ద దాడి చేయ‌డంతో.. ఆ బోర్డ‌ర్ వెంట అప్ర‌మ‌త్తత ప్ర‌క‌టించారు. స‌రిహ‌ద్దు సైనికులు హై అలర్ట్ లో ఉన్నారు. దాడిలో మొత్తం 12 మిరేజ్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.

కాగా పాక్ ఆక్రమిత ప్రాంతంలో వైమానిక దాడులను జీర్ణించుకోలేక పోతుంది పాకిస్థాన్. తాజాగా శ్మీర్‌ మధ్య ప్రాంతంలో భారత వైమానికదళానికి చెందిన ఒక యుద్ధవిమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని పైలట్, కో-పైలట్ అక్కడికక్కడే చనిపోయారని పోలీసు వర్గాలు తెలిపారు.  ఇద్దరు పైలట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నట్లు వివరించాయి. ఈ ఘటన ఉదయం 10.40 ప్రాంతంలో బుడ్గాం పట్టణానికి ఇంచుమించు ఏడు కిలోమీటర్ల దూరంలో  గారాండ్ కలాన్ వద్ద జరిగినట్లు సమాచారం. 

కాగా,  లాంబ్, కెరీ, నరియాన్ ప్రాంతాల్లో బాంబులు వేసిన పాక్ జెట్లు.  భారత భూభాగంలోకి ఎయిర్ స్టైక్ చేశామని చెబుతున్న పాక్. రెండు భారత జెట్లను కూల్చేశామని ప్రకటించిన పాక్. ఓ పైలెట్ ని అరెస్ట్ చేసినట్లు పాక్ సైన్యం ట్విట్.  మరోవైపు పాక్ యుద్ద విమానం ఎఫ్ 16 ని కూల్చేసిన భారత సైన్యం.  పాక్ ఫైటర్ జట్ ని లాంబ్ వ్యాలీలో కూల్చేసిన భారత బలగాలు. సరిహద్దు ప్రాంతాల్లలో మరింత అప్రమత్తంగా భారత బలగాలు.  



మరింత సమాచారం తెలుసుకోండి: