ప్రస్తుతం భారత్ - పాక్ మద్య టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ కి చెందిన యుద్ద విమనాన్ని కూల్చి వేశామని పాకిస్థాన్ వార్తలు ప్రచారం చేసుకుంటుంది.  పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం భారత వాయుసేన ఉగ్రవాద శిభిరాలే లక్ష్యంగా వెయ్యి కిలోల బాంబులను ప్రయోగించి మెరుపు దాడుల నిర్వహించిన విషయం తెలిసిందే.  తాజాగా పాకిస్తాన్ తమ చెరలో అభినందన్‌ అనే ఇండియన్ ఆర్మీకి చెందిన అభినందన్ తమ బందీగా ఉన్నాడని  ప్రకటించింది. ఈ మేరకు అభినందన్ తమ ఆధీనంలో ఉన్నట్టుగా ఓ వీడియోను పాకిస్తాన్ బుధవారం నాడు విడుదల చేసింది.

 ‘నేను వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను. ఐఏఎఫ్‌ అధికారిని. నా సర్వీసు నెంబర్‌ 27981’ అని పైలట్‌ చెప్తున్న అంశాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, పాక్‌ వాదన కట్టుకథ మాత్రమేనని భారత అధికార వర్గాలు స్పష్టం చేశాయి.  గతంలో జరిగిన ఘటన దృశ్యాలను పదేపదే చూపిస్తూ పాక్‌ సైన్యం.. భారత భూభాగంపై దాడులు జరిపిందని అసత్య ప్రచారం నిర్వహిస్తోంది. గతంలో జోధ్‌పూర్‌లో కూలిన ఓ ఫైటర్‌ జెట్‌ దృశ్యాలను చూపిస్తూ జబ్బలు చరుకుంటుంది.  పాకిస్తాన్ ఆర్మీ కి చెందిన అధికార ప్రతినిధి జనరల్ ఆసిఫ్ గఫూర్ మీడియా సమావేశం తర్వాత  ఈ వీడియోను విడుదల చేశారు. 
Image result for పాకిస్థాన్ అసత్య ప్రచారం
కాగా,  విమానాలను కూల్చి వేశామన్న పాక్ ప్రకటన ఖండించిన భారత్. భారత పైలెట్ ని పాక్ అరెస్ట్ చేయలేదు.  భారత పైలెట్స్ అందరూ క్షేమంగా ఉన్నారు.  సాంకేతిక సమస్యలతోనే మిగ్ - 17 విమానం కూలిపోయింది.   భారత్ పైలట్ ని అరెస్ట్ చేసినట్టు ఉన్న వీడియో విడుదల. వీడియో విడుదల చేసిన కొద్ది సేపటికే డిలిట్. దీంతో పాక్ అల్లుతున్న కట్టుకథలు అన్నీ బయట పడుతున్నాయి. పాక్‌ వాదన కట్టుకథ మాత్రమేనని భారత అధికార వర్గాలు స్పష్టం చేశాయి.  రానున్న మూడు రోజులు ఎంతో కీలకం..అందుకే సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..వారికి రక్షణ కల్పించే బాధ్యతలు భారత ప్రభుత్వం చేపట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: