పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి తర్వాత భారత జాతి రగిలిపోతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రతి ఒక్కరూ గొంతెత్తున్నారు. ఈ నేపథ్యంలో స‌రిహ‌ద్దులు వేడెక్కాయ్. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి, ఆక్రమిత పాకిస్థాన్‌ భూభాగంలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై దాడులు మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

మంగళవారం తెల్లవారుజామన భారత వైమానిక దాడులు అనంతరం పాకిస్థాన్ కూడా భారత్‌పై దాడులకు తిరిగి ప్రయత్నిస్తోంది. అయితే భారత సైన్యం పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇరుదేశాల పరస్పర దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన f-16 ఫైటర్ జెట్‌‌ను నేలమట్టం చేశామన్నారు. అయితే ఈ దాడుల్లో మిగ్-21 విమానం పాక్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో మిగ్ -21 భారత పైలట్ తప్పిపోయాడ‌ని భార‌త సైన్యం ప్ర‌క‌టించింది.

వైమానిక దాడుల నేప‌థ్యంలో దూర ప్ర‌యాణాల విష‌యంలో, ముఖ్యంగా విమాన ప్ర‌యాణాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని భార‌తీయుల‌ను కోరుతోంది భార‌త వైమానిక‌ద‌ళం. భార‌త్-పాక్ యుద్ధ‌మేఘాల నేప‌థ్యంలో భార‌తీయులు విమాన ప్ర‌యాణాల విష‌యంలో వాయిదా వేసుకోవ‌డ‌మే మంచిద‌ని సూచిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: