లేటుగానైనా లేటెస్ట్ గా అని ఓ సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంది. ఇపుడు అది ఏపీలో అచ్చంగా అమలవుతోంది. వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలన్నీ సరైన టైంలో ఉంటున్నాయి. ఆయన చాలా మెచ్యూరిటీతో తీసుకుంటున్న నిర్ణయాలు ఇపుడు ఏపీలో ప్రత్యర్ధి పార్టీలకు చుక్కలు కనిపించేలా చేస్తున్నాయి.


అమరావతికి జగన్ :


జగన్ పై ఇన్నాళ్ళూ ఓ విమర్శ ఉండేది. హైదరాబాద్ లో ఉండి రాజకీయాలు చేస్తున్నారని. జగన్ పొరుగు రాష్ట్రం వారని, ప్రవాసాంధ్రుడని అంటూ ఉండేవారు. ఇక చినబాబు అయితే కాస్తా ముందుకు వెళ్ళి మరీ ఇతర రాష్ట్రాల వారితో తమకేం పని అంటూ విసుర్లు విసిరారు. అయితే సాంకేతికంగా చూస్తే ఉమ్మడి ఏపీ విడిపోయి కేవలం అయిదేళ్ళు మాత్రమే అయింది. పైగా పదేళ్ళ పాటు హైదరాబాద్ మన ఉమ్మడి రాజధాని కూడా. కేవలం ఓటుకు నోటు కేసు కారణంగానే ఆదరాబాదరాగా చంద్రబాబు హైదరాబాద్ ని విడిచి అమరావతికి వచ్చాడని కూడా అంటారు. 


విషయం ఇలా ఉంటే జగన్ పొరుగు రాష్ట్రం వాడని కేవలం రాజకీయ విమర్శలు చేసిన బాబు సర్కార్ ఏపీ ప్రతిపక్ష నాయకుడికి ఓ అధికారిక భవనం నివాసంగా చూపించలేక‌పోయింది. తప్పు తన వద్ద ఉంచుకుని నిందలు వేయడం టీడీపీకి అలవాటేగా. అందుకే ఇపుడు జగన్ రైట్ డెసిషన్ తీసుకుని అమరావైతికి వచ్చేశారు.


కూత వేటు దూరంలో :


ఏపీ సీఎం చంద్రబాబుకు కూత వేటు దూరంలో జగన్ ఇపుడు నివాసం ఉంటున్నారు. ఏపీ రాజకీయాలో ప్రత్యర్ధులుగా ఢీ అంటే ఢీ అంటున్న జగన్, చంద్రబాబు ఇపుడు ఇరుగు పొరుగు అయ్యారు. ఈ ఇద్దరూ ఇపుడు ముఖ్యులే. ఈ ఇద్దరిలోనే రేపటి సీఎం ఒకరున్నారు. జగన్ ఫ్యూచర్ సీఎం అని ఓ వైపు సర్వేలు ఘోషిస్తున్న వేళ జగన్ తన నివాసాన్ని మార్చడం ద్వారా అమరావతికి కొత్త కళ తెచ్చేశారు. ఇక చూసుకుంటే చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో సొంత నివాసం కట్టుకోలేదు. ఆయన ఉండేది లింగమనేని  ఎస్టేట్స్ లో. ఆయన సొంత భవనాలు అన్నీ హైదరాబాద్ లోనే కట్టారు. ఇదే ఈ రోజు నుంచి వైసీపీ బాబుపై చేస్తున్న సరి కొత్త విమర్శ. 


పర్మనెంట్ సీఎం :


ఇక ఏపీకి కాబోయే సీఎం పర్మనెంట్ సీఎం కాబట్టే జగన్ తన సొంత నివాసాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యె రోజా పేర్కొన్నారు. అదే చంద్రబాబు టెంపరరీ సీఎం కాబట్టే ఆయన‌ కట్టడాలు అన్నీ కూడా టెంపరరీగానే ఉన్నాయని. ఆయన ఓడిపోగానే హైదరాబాద్ వెళ్ళిపోతారని కూడా రోజా సెటైర్లు వేశారు. ఇక జగన్ మీద చేసేందుకు విమర్శలు లేకపోవడంతో ఈ రోజు నుంచి చంద్రబాబు అండ్ కో కొత్త కామెంట్స్ చేస్తోంది. జగన్ కి ప్యాలస్ లే కావాలి తప్ప మామూలు ఇళ్ళు సరిపోవు అని. అందుకే ఆయన రాజ భవంతులు కట్టుకుంటున్నాడని కూడా బాబు హాట్ కామెంట్స్ చేశారు. మొత్తానికి పక్కనే చేరిన రాజకీయ ప్రత్యర్ధులు మరెన్ని కామెంట్స్ చేస్తుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: