భారత్ ... పాకిస్థాన్ భూభాగంలోకి పోయి మరి బాంబుల వర్షం కురిపించింది. అయితే అంతర్జాతీయంగా భారత్ ను ఏ ఒక్క దేశం కూడా తప్పు పట్టకపోవడం గమనార్హం. అయితే ఎందుకంటే ఉగ్రవాదులను మొదటి నుంచి పెంచిపోశిస్తోంది పాకిస్తాన్ అనే విషయం ప్రపంచానికంతటికి తెలుసు. దీంతో భారత్ ఆ దేశ భూభాగంలోకి వెళ్లి దాడి చేయడంపై ఏ దేశం కూడా ఖండించడం లేదు. పైగా ఉగ్రవాదుల శిబిరాలను టార్గెట్ చేయడంతో అంతర్జాతీయంగా భారత్ కు బాసట లభిస్తోంది.


మరో 72 గంటల్లో ఏదైనా జరగొచ్చు .. మేము తలుచుకుంటే గడ్డి పరక కూడా మొలవదు :పాక్

ఇక మొదటి నుంచి పాకిస్తాన్ కు మద్దతు ఉంటున్న చైనా కూడా భారత్ కొంత సంయమనం పాటించాలని కోరిందే తప్పా ఎక్కడా తప్పుపట్టిన దాఖలు లేవు. పాకిస్తాన్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించనూ లేదు. దీంతో చైనా అండ దొరుకుతుందన్న పాకిస్తాన్ కు నిరాశ ఎదురైంది.ప్రస్తుత పరిస్థితులు పాకిస్థాన్ అంతగా అనుకూలంగా లేవు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న భారత్ కే ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయి.

Image result for india surgical strike

పాకిస్తాన్ తమ దేశంలోని ఉగ్రవాద శిబిరాలను నామరూపాల్లేకుండా చేయాలని ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు బహిరంగంగా హెచ్చరిస్తున్నాయి. చైనా కు పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచన పడింది. ఇక రష్యా భారత్ కు అత్యంత మిత్ర దేశం. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ బలగాలు వెళ్లినా అంతర్జాతీయంగా భారత్ కే సపోర్టు లభిస్తుండటం విశేషంగా చెప్పొచ్చు.  మరీ పాకిస్తాన్ వైఖరి మారుతుందో లేక కయ్యానికి కాలుదువ్వుతుందో చూడాలి మరీ..

మరింత సమాచారం తెలుసుకోండి: