Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:06 am IST

Menu &Sections

Search

"ఎన్టీఆర్ మహానాయకుడు" టిడిపి సభ్యులంతా చూడాల్సిందే! బాబు హుకుం జారీ?

"ఎన్టీఆర్ మహానాయకుడు" టిడిపి సభ్యులంతా చూడాల్సిందే! బాబు హుకుం జారీ?
"ఎన్టీఆర్ మహానాయకుడు" టిడిపి సభ్యులంతా చూడాల్సిందే! బాబు హుకుం జారీ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అధికారాంతమందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్‌”- అనే సామెతకు ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నూరుపాళ్లు న్యాయం చేస్తున్నట్లే ఉంది పరిస్థితులు చూస్తుంటే. ఎన్టీఆర్ మహానాయకుడు టిడిపి కుటుంబ సభ్యులంతా చూడాల్సిందే! హుకుం జారీ! నిజమా?  


వైఫల్యం చెందిన సినిమాలను ఇప్పుడు "ఎన్టీఆర్ మహానాయకుడు" సినిమా తరహాలో రాజకీయ పార్టీలు గట్టెక్కిస్తే సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అద్భుతంగా విలసిల్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారమిచ్చి రాష్ట్రాన్ని మీ నలభై సంవత్సరాల అనుభవంతో పాలించు నాయనా! బాబూ! అంటే నా బామ్మర్ధి సినిమాకు - వినోదపన్ను రద్ధు చేస్తా! మా బామ్మర్ధి సినిమాకే ఉత్తమ చిత్రం అవార్డ్ ఇస్తా! మా బామ్మర్ధి సినిమాలు రోజుకు ఎన్నాటలైనా వేసుకోనిస్తా! అంటూ పాలించే ఈ పరిపాలకుడు రాష్ట్రానికి అవసరమా? అంటూ ఐదుకోట్ల ఏపి ప్రజలు ఆక్రోశంగా ఎదురు చూస్తున్నారు.    

ap-news-telangana-news-chandrababu-at-end-of-power

"ఎన్టీఆర్ కథానాయకుడు" సినిమా వారం పది రోజులు థియేటర్లలో నిలబడింది. అయితే "ఎన్టీఆర్ మహానాయకుడు" మూడు రోజుల లోపే సామాన్ సర్దేస్తోంది. ఖాళీగా కనిపిస్తున్న థియేటర్లే దీనికి నిదర్శనం. మల్టీప్లెక్స్-ల్లో సైతం పట్టుమని పదిమంది కూడా థియేటర్ కు రావడం లేదు. కారణం యథార్ధం సయించని పెద్దల సినిమా అంటే ప్రజలకు మొహం మొత్తింది. ఈ కాలంలో మేం గొప్ప, మా కుటుంబం గొప్ప, మా రక్తం చిక్కన, మా వశం - మా బ్రీడ్ ప్రత్యేకం అంటే వీళ్ళు మనుషులు కాదు జీన్స్ రీత్యా మరో రకం జంతువులు అంటారు. దానికి తగ్గట్లే వీరు మృగాల పేర్లే ఇష్టపడతారు. ఈ తరహా సినీ నిర్మాణమే సినిమా వైఫల్యానికి దారి తీసింది.

ap-news-telangana-news-chandrababu-at-end-of-power

ఒకవైపు చంద్రబాబు ఇది మన సినిమా, మన తెలుగు దేశం పార్టీ తో అనుసంధానమైన సినిమా, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి అంటూ, తన ముఖ్యమంత్రి హోదా మరచి తెలుగు తమ్ముళ్లకు ఉపదేశం ఇస్తుంటే, కూడా థియేటర్ల వైపే కన్నెత్తి చూడటం లేదు తెలుగు దేశం పార్టీ ప్రజలు. దీంతో సినిమా ఎలాగైనా ఆడేలా చేయా లని నేతలపై అధినేత ఒత్తిడి పెంచారు. అంతే బుధవారం నుంచి "చందాషో" లు మొదలయ్యాయి. కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ ఉండాలనేది తెలుగుదేశం నేతలకు చంద్రబాబు దిశానిర్దేశమట. అయినా ఒక సినిమా ఫెయిల్ అయితే నిశ్శబ్ధంగా ఉంటేనే మంచిది. ఇలా ఫోర్స్ చేసి సినిమా నడిపిస్తే "టాక్ ఆఫ్ ది మౌత్" గా ప్రపంచాన్ని ఆ అవమానం చుట్టేయటానికి వారం కూడా పట్టదు. ఆ దెబ్బకు సినిమా పరువుతో మాత్రమే కాదు నందమూరి తారక రామా రావు గారి ఆత్మ క్షోభించటం తధ్యం.  

ap-news-telangana-news-chandrababu-at-end-of-power

అలా "ఎన్టీఆర్ మహానాయకుడు" ని టీడీపీ నేతలు చందాలు వేసుకుని మరీ ఆడిస్తున్నారు. "పెయిడ్-షో" లు పెరిగిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. టీడీపీ నేతలు టికెట్లు కొని బ్రతిమిలాడి మరీ ప్రేక్షకులను పోగేసి పంచిపెడుతున్నారు.

ap-news-telangana-news-chandrababu-at-end-of-power

చూడగల వారికి ఈ సినిమా ఉచితం స్కీం - ఈ లేఖ అంతర్జాలంలో వైరల్ అవుతుంది - ఆ మహానటుణ్ని- నాయకుణ్ణి రోడ్లపైకి లాగెయ్యటం అంటే ఇదే! పాపం ఆయన ఆత్మకు క్షోభ కలగకుండా ఉందాలని ప్రార్ధన.


వారం వారం పోలవరంలాగా - వారం వారం ఒకో వర్గం అంటూ - బుధవారం జర్నలిష్టులు, వారి కుటుంబ సభ్యులకు టికెట్లు ఉచితంగా అందించారు. ఇలా ఒక్కో రోజు ఒక్కో వర్గం వారికి టికెట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెబుతున్నారు. అవసరమైతే థియేటర్లలో ఉచిత బిరియాని, వాటర్ పాకెట్లు ఇంకా అవసరమైతే... వారుణీ వాహిని కూడా సరపరా చేస్తారేమో అని సెటైర్లు పడిపోతున్నాయి.

ap-news-telangana-news-chandrababu-at-end-of-power

ఇప్పుడు తాజాగా డ్వాక్రా మహిళలకు ఫ్రీషోలు వేయమని ఆదేశాలు వచ్చాయట. ఆ ఖర్చులన్నీ స్థానిక టిడిపి క్యాడర్ భరిస్తుంది. ఎగ్జిబిటర్ కు టికెట్ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి నో చెప్పడానికి లేదు. అయితే ఇలా ఎన్టీఆర్ లాంటి వెండితెర వేల్పు సినిమాను వారం తిరక్కుండానే ఇలా ఫ్రీ-షోల పేరుతో పరువు తీయడం ఏమిటని ఫ్యాన్స్ వాపోతున్నారు. 

ఒకప్పుడు బళ్ళు కట్టుకుని బ్లాక్ లో టికెట్లు కొని కుటుంబ సమేతంగా తన సినిమాలకు జనం వచ్చేలా చేసుకున్న ఎన్టీఆర్ కథను తెరమీద ఇలా ఉచితంగా లాక్కెళ్ళి బల వంతంగా చూపించాల్సిన దుస్థితి ఎంటని వాళ్ళ వెర్షన్. ఇది ఇంకొద్ది రోజులు కొనసాగితే ఫ్రీ-టికెట్ల వ్యవహరం కాస్తా జాతీయ మీడియాలో సైతం జోక్ గా మారే ప్రమాదం ఉంది. చూసుకోండి మరి. 

ap-news-telangana-news-chandrababu-at-end-of-power

ఉచితంగా టికెట్లిచ్చినా కొంతమంది మొహమాటానికి వాటిని తీసుకుని తలనొప్పిని తప్పించుకోవటానికి సినిమాకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే జనాల్లో "ఎన్టీఆర్ మహానాయకుడు" సినిమా పట్ల ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ భయం తోనే ఎవరూ థియేటర్ల వైపు కన్నెత్తి చూడడం లేదట. ఉచితంగా టికెట్లి చ్చినా, ఇంటర్వెల్ లో స్నాక్స్-ఫ్రీ అని చెప్పినా కూడా ఒక నర మానవుడు, నటసింహం బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూడడానికి సాహసం చేయడం లేదట.


చంద్రబాబు మాత్రం టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ సినిమా కచ్చితంగా చూడాలని హుకుం జారీ చేశారు. తెలుగు తమ్ముళ్లు సినిమా చూస్తున్నారా? లేదా? అనే విషయాన్ని తెలుసు కునేందుకు జిల్లాల వారీగా థియేటర్లలో నిఘా కూడా పెట్టారని ఒక టిడిపి వ్యతిరేఖ మీడియా రాసింది. ఆయన దృష్టిలో అదో అద్భుత కళాఖండం. ఎంతైనా ఆ సినిమా లో తన పాత్ర "హీరో" కదా! అందుకే ప్రతి ఒక్కరూ "ఎన్టీఆర్ మహానాయకుడు" చూడాలనేది బాబుగారి తపన. అయితే మీ మామగారి జీవిత చిత్రంలో మీరు కథానయకుడు కావటమేంటి? అలా ఐతే మీ జీవన చిత్రం నిర్మిస్తే మంచిదికదా? అంటున్నారు ప్రేక్షకులు.

ap-news-telangana-news-chandrababu-at-end-of-power

చంద్రబాబు గారి తపన తీరుతుందో? లేదో? కానీ, ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలతో డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా మునిగిపోయారనేది వాస్తవం. మరికొన్ని రోజుల్లో బాలకృష్ణ  నుంచి ఎలాంటి స్పందన రాకపోతే, వీళ్లంతా కలిసి ఆయన ఇంటి ముందు ధర్నా చేయడానికి సమాయత్తమౌతున్నారని ప్రచారంలో ఉంది.

ap-news-telangana-news-chandrababu-at-end-of-power

ap-news-telangana-news-chandrababu-at-end-of-power
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
వజ్రం లోపల మరో వజ్రం - ప్రపంచ అద్భుతం
పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక
అన్నీ మంచి శకునములే: మందగమనం ఉన్నా భవిష్యత్ ఆశాజనకం: ఐటీసి
జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ కు సీపీఐ ఝలక్?
జస్టిస్ చంద్రకుమార్ సంచలనం: కేసీఆర్ ది నోరా? మోరీనా?
కేంద్రం సంచలన నిర్ణయం: ఒక్కో కుటుంబానికి ₹5.50 లక్షలు ప్రయోజనం
"ఐదు ట్రిలియన్ డాలర్ ఏకానమి" గా భారత్ - వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో వక్తలు
ఆర్ధిక సంక్షోభానికి ఇదేమైనా దారితీస్తుందా?
About the author