తెలుగుదేశం పార్టీ ఎడా పెడా అభ్యర్ధులను ఎంపిక చేస్తోంది. ఐతే బయటకు ప్రకటించకున్నా అనధికారికంగా పనిచేసుకోమంటోంది. ఇదంతా సమరోత్సాహంతో చంద్రబాబు చేస్తున్నారు. . తనకు అందరి జాతకాలు తెలుసు అంటున్నారు. గెలుపు గుర్రాలకే అవకాశలు ఇస్తాము అని కూడా చెబుతున్నారు మరి ఆ గెలుపు గుర్రాలను ఎలా కనిపెట్టారో.


లగడపాటి ఎంటర్ :


టీడీపీ రాజకీయలతో కలగలపుకుని తిరుగుతున్న మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేల ఆధారంగానే బాబు టికెట్లు కేటాయిస్తున్నారన్న న్యూస్ ఇపుడు వైరల్ అవుతోంది. లగడపాటి మీద బాబుకు అంత గురి మరి. తెలంగాణాలో ఫలితాలపై లగడపాటి చేసిన సర్వే తుస్సుమన్నా కూడా బాబు గారు మాత్రం లగడపాటిని ఎక్కడా తక్కువ చేయడంలేదు. ఆయన చెప్పినట్లుగానే ఎంపిక చేస్తున్నారుట. ఈ విధంగా చేయడం వల్ల చాలామందికి సీట్లు చిరిగిపోతున్నాయట. ఆశావహులు కూడా టికెట్లు దొరకక అసహనం  వ్యక్తం చేస్తున్నారుట.


ఇదెక్కడి సర్వే :


తమ ప్రాంతంలో తాము బలంగా  ఉన్నామని, అయినా సర్వే అంటూ పక్కన పెడుతున్నారని తమ్ముళ్ళు లబోదిబో అంటున్నారు. తమ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా తూతూమంత్రంగా సర్వేలు చేసినట్లు చూపించి ఎవరికో టికెట్లు ఇచ్చేస్తున్నారని ఆడిపోసుకుంటున్నారు. దీని వెనక లగడపాటి సర్వేలు కారణమని తెలిసి ఆయన మీద కస్సుబుస్సులాడుతున్నట్లుగా భోగట్టా. మరి బాబు ఎందుకు ఇలా లగడపాటి వారికి ప్రాధాన్యత ఇచ్చారో అని వాపోతున్నారు. 
నిజానికి ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ  బాబు ఎపుడూ ఇలా చేయలేదని, తన సొంత ఆలోచనలతోనే  గతంలో ఎంపిక చేశారని అంటున్నారు. ఈసారి మాత్రం అన్నీ విరుద్ధంగా జరుగుతున్నాయని అంటున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు. లగడపాటి వారిని నమ్ముకుంటే తెలంగాణా ఫలితాలే రిపీట్ అవుతాయని కూడా అంటున్నారు. మరి బాబు వద్ద అంధ్రా ఆక్టోపస్ హవా ఓ రేంజిలో ఉండగా తమ్ముళ్ల మాటలు వినిపిస్తాయా.



మరింత సమాచారం తెలుసుకోండి: