రాయలసీమ పర్యటనలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జగన్ పై ఘాటుఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఎందుకు అసెంబ్లీ కి వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లాలో కొందరు నేతల రౌడీయిజానికి, దౌర్జన్యానికి కాలం చెల్లిందని.. వారి కోటలు బద్దలు కొట్టడానికి జనసేన వస్తోందని పవన్ అంటున్నారు.

Related image


వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజలను బానిసలుగా చూస్తున్న నాయకులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని జగన్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత రాయలసీమకు ఎలా వస్తాడో చూస్తాం’ అని తనను గతంలో హెచ్చరించిన వారిపై ఆయన విమర్శలు గుప్పించారు.

Image result for pawan kadapa tour


తాను కిరాయి మూకలు, ప్రైవేట్ సైన్యానికి తాను భయపడేవాడిని కాదని జనసేనాని చెప్పుకొచ్చారు. వేల కోట్లు దోచుకుని, రౌడీయిజం చేసే వారికి భయపడనని అన్నారు. ‘డప నుంచే చెబుతున్నా.. మీ కోటలు బద్దలు కొడతా అంటూ సవాల్ విసిరారు. అంతే కాదు.. జనసేన కుర్రోళ్ల పార్టీ అని అంటున్నారని..., సత్తా చాటేది తామేనని పవన్ అన్నారు.

Related image


తాము ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు రత్నాలు ఇస్తామని కొందరు ఆశపెడుతున్నారని... ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక, ప్రజలకు తానేమీ రత్నాలు ఇవ్వనని, ఆ స్తోమత కూడా తనకు లేదని పవన్ అన్నారు. కానీ ప్రజల కోసం పాటుపడే హృదయం మాత్రం తనకు ఉందని అన్నారుజగన్ కడప పర్యటన అంతా జగన్ విమర్శలతోనే సాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: