నేపాల్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలిన ఘటనలో నేపాల్ టూరిజం శాఖ మంత్రి రబీంద్ర అధికారి సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.  నేపాల్‌లోని తెహ్రాతుమ్ జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి 27) మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కూలిన ఘటనను నేపాల్ పౌర విమానయాన సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో రవీంద్ర అధికారితో సహా ఆరుగురు మృతి చెందారు.టాపెజంగ్ జిల్లాలోని పాతిభారా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.   

tourism minister among 6 killed in nepal helicopter crash

మృతుల్లో మంత్రితోపాటు హెలికాప్టర్ పైలట్, భద్రతా అధికారి అర్జున్ గిమిరే, పర్యాటక వ్యాపారి, యతి ఎయిర్‌లైన్స్ డెరెక్టర్, ఎయిర్ డైనాస్టీ చైర్మన్ ఆంగ్‌చింగ్ షెర్పా, ప్రధాని దగ్గరి బంధువు యుబ్బరాజ్ దహల్, సివిల్ ఏవియేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బీరేంద్రశ్రేష్ఠ, మరో వ్యక్తి ఉన్నారు. ఘటనాస్థలికి సహాయ సిబ్బంది చేరుకొని మంత్రి, పైలట్‌తోపాటు ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Image result for nepal helicopter crash

 పర్యాటక మంత్రి ఇతర అధికారులతో కలిసి ఓ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం చుహన్ దండలో విమానాశ్రయ నిర్మాణ పనులు పరిశీలించటానికి వెళ్తుంతగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.  మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో క్యాబినెట్‌ అత్యవసర సమావేశానికి నేపాల్‌ ప్రధానమంత్రి  పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: