కుక్క తోక వంకరే అన్నట్లుంది పాక్ పరిస్థితి.  నిన్న పాక్ ప్రధాని కూర్చొని మాట్లాడుదాం..యుద్దం వల్ల అందరికీ నష్టాలే..ఉగ్రవాదాన్ని అణిచేందుకు తాము పూర్తి సహకారాన్ని అందిస్తామని..పుల్వామా దాడి కేసు లో పూర్తి విచారణకు సహకరిస్తామని తెగ ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ పదే పదే కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్. ఉదయం నుంచి భారత్ పోస్ట్ లపై గుళ్ల వర్షాన్ని కురిపిస్తున్న పాకిస్థాన్.
Image result for Vardhaman Abhinand
పుల్వామా దాడి తర్వాత భారత్ జరిపిన వైమానిక దాడిలో 300 మంది ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో పాకిస్థాన్ భారత్ గడ్డపై తమ ఎరోజెట్ విమానాలు పంపించింది..వాటిని ముందే పసిగట్టిన భారత్ జవాన్లు తిప్పి పంపించారు.  కాగా, తమ‌ భూభాగంలో కూల్చేసిన విమానంలో ఉన్న పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు పాక్‌ అధికారులు వెల్లడించారు. ఆ పైలెట్ పేరు వర్థమాన్ అభినందన్ గా పాక్ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించినదిగా చెబుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.
Related image
మన సైనికుడిని కొంత మంది దారుణంగా హింసించడంతో పాక్ పై నిప్పులు చెరిగారు భారతీయులు. దీనిపై పాక్ విదేశాంగ మంత్రికి సమన్లు పంపించారు భారత్.  జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా కృష్ణా ఘాటి సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వద్ద ఇవాల ఉదయం 6 గంటలకు పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. సుమారు గంటపాటు జరిగిన ఈ కాల్పులను భారత జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. సుమారు గంటపాటు జరిగిన ఈ కాల్పులను భారత జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: