దాయాది దేశం అయిన పాకిస్థాన్ కొంత కాలంగా కవ్వింపు చర్చలకు పాల్పపడుతూనే ఉంది.  ఓ వైపు స్నేహ సంబంధాలు కొనసాగించాలని సూచిస్తూనే మరోవైపు సరిహద్దు వద్ద కాల్పుల విరమణకు పాల్పపడుతుంది.  పుల్వామా దాడికి ప్రతిదాడిగా మొన్న భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత ప్రాంతంలోకి చొరబడి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది.  దాంతో ఒక్కసారే ఉలిక్కి పడ్డ పాకిస్థాన్ సైతం యుద్దానికి సిద్దం అన్నట్లు దాడులు ప్రారంభించింది. బుధవారం మన సరిహద్దుల్లోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేగా.. భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ పాక్ సైన్యానికి చిక్కాడు.

దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. దాంతో భారత్‌కు నడిపే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ రైల్వేస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాకిస్తాన్ భూభాగంలో వాఘా నుంచి లాహోర్ వరకు ఈ రైలు నడుస్తోంది.

తాజా పరిస్థితుల నేపథ్యంలో రైలు రాకపోకలను పాక్ నిలిపివేసింది. భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు యధావిధిగా షెడ్యూల్‌ ప్రకారం నడుస్తుందని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నడిపించే విషయమై అధికారులనుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, అందువల్ల ఈ రైలు షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తుందని ఆయన చెప్పారు. 
Pakistan Suspends Samjhota Express Service - Sakshi
వారంలో రెండు రోజులు(బుధ, ఆది) ఢిల్లీ నుంచి పాక్‌కు నడిచే ఈ రైలు.. బుధవారం యథావిధిగా ఢిల్లీ నుంచి బయలుదేరింది. అయితే ఎప్పటిలాగా లాహోర్ వరకు కాకుండా అటారీ వరకే రాకపోకలు సాగించనుంది. 1976లో భారత్-పాక్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైంది. సంఝౌతా పదానికి ‘ఒప్పందం’అనే అర్థం వస్తుంది. 1976, జులై 22న రెండు దేశాల మధ్య తొలి రైలు పరుగులు తీసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: