ప్రజాస్వామ్యంకు , విలువలకు , ప్రజలకు గౌరవం ఇవ్వకుండా వైసీపీ పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇప్పుడు రాజకీయ భవిష్యత్ కనిపించడం లేదు . ఒక పక్క చంద్ర బాబు పార్టీ టిక్కెట్ ఇవ్వను అంటున్నాడు. ఇంకొక పక్క జగన్ వీరిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. ప్రత్యేకించి ఎన్నికలు జరిగిన తర్వాత చట్టసభల్లో ప్రమాణం చేయకముందే పార్టీ మారిపోయిన కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి - కర్నూలు ఎంపీ బుట్టా రేణుకలకు ఈ దఫా టీడీపీ అసలు టికెట్లే ఇవ్వడం లేదు.

Image result for chandra babu and jagan
మారిన తాజా రాజకీయ పరిస్థితుల్లో టీడీపీలోకి వచ్చి చేరుతున్న వలస నేతలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు.. చాలా కాలం క్రితమే జంపింగ్ చేసిన వీరిని మాత్రం పట్టించుకోవడం లేదు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భార్య - కుమారుడు - అనుచర గణంతో కలిసి ఆయన ఎల్లుండి టీడీపీలో చేరిపోతున్నారు. కర్నూలు ఎంపీ టికెట్ తో పాటు ఆలూరు ఎమ్మెల్యే సీటు ఖరారు చేసుకున్న తర్వాతే కోట్ల సైకిలెక్కేస్తున్నారు. దీంతో కర్నూలు ఎంపీగా ఉన్న బుట్టా రేణుకకు ఈ దఫా టికెట్ లేదని చంద్రబాబు తేల్చేశారు.
Image result for chandra babu and jagan
ఇక నంద్యాలలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. వైసీపీ కర్నూలు జిల్లా కన్వీనర్ గా ఉన్న గౌరు వెంకటరెడ్డి - పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్న తన సతీమణి గౌరు చరితారెడ్డితో కలిసి త్వరలోనే టీడీపీలో చేరనున్నారట. తన బావ మాండ్ర శివానందరెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్ కన్ ఫార్మ్ చేస్తే టీడీపీలోకి వచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని గౌరు చెప్పడంతో... ఆ ప్రతిపాదనకు చంద్రబాబు దాదాపుగా ఓకే చెప్పేశారట. అంటే.. నంద్యాల ఎంపీ టికెట్ ఈ దఫా మాండ్రకే ఖాయమన్న మాట. మరి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి పరిస్థితి ఏమిటంటే... రిక్త హస్తమేనట. 

మరింత సమాచారం తెలుసుకోండి: