ఏపీ సీఎం చంద్రబాబు మీడియా మేనేజ్ మెంట్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులోని రెండు ప్రధాన పత్రికలు ఆయనకు అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. శాయశక్తులా ఎలాంటి విషయాన్నైనా చంద్రబాబుకు అనుకూలంగా మార్చేందుకు ఈ పత్రికలు ప్రయత్నిస్తాయని అంటుంటారు.



తాజాగా ఓ సంఘటన దీన్ని ఈ అనుబంధాన్ని మరోసారి రుజువు చేసింది. విశాఖకు ప్రత్యేక జోన్ ప్రకటించిన సంగతి తెలిందే. దానిపై ఓ ప్రముఖ పత్రిక కథనం రాస్తూ.. మాయా జోన్ అంటూ విమర్శించింది. దీని వల్లే ఏపీ కి నష్టం అంటూ ఓ సుదీర్ఘ విశ్లేషణను మొదటి పేజీలో ప్రచురించింది.



ఆ తర్వాత ఓ సభలో ప్రసంగించిన చంద్రబాబు కూడా అదే స్లోగన్ అందుకున్నారు. ఆ పత్రికలో వచ్చిన బ్యానర్ లైన్ మాయాజోన్‌ ను చంద్రబాబు కూడా అందిపుచ్చుకున్నారు. విశాఖ రైల్వేజోన్ కాదు... మాయా జోన్ ఇచ్చారు అంటూ చంద్రబాబు ఆ సభలో విమర్శించారు.



కేంద్రం ప్రకటించిన విశాఖ పట్నం రైల్వే జోన్ ను మసిపూసిన మారేడు కాయ అని చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. ఎక్కువ ఆదాయం వచ్చేదానిని పొగొట్టి, తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర పన్నారని ఆయన అన్నారు. రిక్రూట్ మెంట్ లలో ఒడిషాకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. రాష్ట్రానికి వచ్చే మోడీకి నల్లజెండాలు, నల్ల బెలూన్లు, నల్లచొక్కాలతో నిరసన తెలపాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: