ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ వ‌చ్చే ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌ాలని భావిస్తున్నారు. పార్టీకి ఆయువుప‌ట్టు లాంటి నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోకేష్ ఎమ్మెల్యే బ‌రిలోకి దించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు త‌గ్గట్టుగా త‌గిన బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం కోసం కొద్ది రోజులుగా అన్వేషిస్తున్నారు.



మొదట్లో కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు నుంచి పోటీ చేస్తాడ‌ని ఇప్పటి వ‌ర‌కు వార్తలువ‌చ్చాయి. అయితే ఇప్పుడు లోకేష్ కోసం బాబు స‌రికొత్త వ్యూహం ప‌న్నిన‌ట్టు తెలుస్తోంది. కానీ లోకేశ్ సేఫెస్ట్ ప్లేస్ కోసం చూస్తున్నారట. ఓటమికి ఏ మాత్రం అవకాశం లేని స్తానం కోసం వెదుకుతున్నారట.



ఆ వెదుకులాటలో భాగంగానే ఆయన కన్ను భీమిలిపై పడింది. ఇది మంత్రి గంటా నియోజకవర్గం. దమ్మంటే జగన్ ఇక్కడ పోటీ చేసి గెలవాలని ఇటీవల గంటా సవాల్ కూడా విసిరారు. తాను లక్ష మెజారిటీ గెలుస్తానని మంత్రి గంటా ఘంటాపథంగా చెబుతున్నారు.

Image result for bheemili


అందుకే ఇప్పుడు లోకేశ్ భీమిలి నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారని ప్రముఖ తెలుగు పత్రిక కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు, బాల‌య్య ఇద్దరూ సీమ‌ నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అందుకే లోకేశ్ ఉత్తరాంధ్రను ఎంచుకుని ఉండొచ్చు. కానీ ఎక్కడ పోటీ చేయాలనే దానిపై ఇంత గుంజాటన అవసరమా..?


మరింత సమాచారం తెలుసుకోండి: