లాస్ట్  టైం గుంటూరు సభలో మోడీ .. చంద్ర బాబు మీద విమర్శలు గుప్పించి టీడీపీ లో దడ పుట్టించాడు. అయితే ఇప్పుడు విశాఖ లో సభ జరగనున్నది.  ఈ సభ కోసమేనన్నట్లుగా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ని కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. నిన్న కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ కొత్త రైల్వేజోన్‌పై ప్రకటన చేయడం, ఈ రోజు కేంద్ర క్యాబినెట్‌ రైల్వే జోన్‌కి ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. దాంతో, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి ఏపీలోని బీజేపీ శ్రేణులు. 

Image result for narendra modi

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ అన్నది ఈనాటి అంశం కాదు. దశాబ్దాలుగా 'తొక్కిపెడుతోన్న' అంశం. ఇన్నేళ్ళకు ఆ కల సాకారమయ్యింది. వాల్టేర్‌ డివిజన్‌ని ముక్కలు చేసి, ఓ ముక్కని విజయవాడలో కలపడం, మిగిలిన భాగాన్ని రాయగడ డివిజన్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నా, అంతిమంగా ఆంధ్రప్రదేశ్‌కి కొత్త రైల్వే జోన్‌ రావడంతో బీజేపీ మీద కొంత వ్యతిరేకత తగ్గే అవకాశం వుందన్నది నిర్వివాదాంశం. 

Image result for narendra modi

మొత్తమ్మీద, రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్న దరిమిలా, ఆంధ్రప్రదేశ్‌ నరేంద్ర మోడీ బహిరంగ సభ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబుపై నరేంద్ర మోడీ పేల్చబోయే విమర్శల బాంబులు, మాటల తూటాల సంగతి పక్కన పెడితే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మోడీ సానుకూలంగా స్పందించాలన్న సాధారణ ప్రజానీకం ఆశలు ఏమవుతాయో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: