ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా తిరిగిరానున్నాడు.  భారత భూభాగంలోకి వచ్చిన పాక్ విమానాలను తరుముతూ ప్రమాదశాత్తు పాక్ సైన్యానికి బందీగా చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ ప్రభుత్వం నేడు విడుదల చేయబోతోంది.  మొదటి నుంచి బుల్లెట్ కి బుల్లెట్ తో సమాధానం చెబుతూనే భారత్ దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరుపుతుంది. 
Image result for abhinandan return india
మొత్తానికి భారత్ ఒత్తిడికి తలొగ్గిన పాక్..  వింగ్ కమాండ్ అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కు తిరిగి పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.  పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన ఈ ప్రకటనతో దేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. అభినందన్ వర్థమాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు గురువారం రాత్రి చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరారు.
Image result for abhinandan return india
విమానంలోని ఇతర ప్రయాణికులు వారు అభినందన్ కుటుంబ సభ్యులు అని తెలుసుకుని చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, పాక్ చెర నుంచి విడుదల కాబోతున్న అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అనుమతి ఇవ్వాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు.

  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ మధ్యాహ్నాం 12గంటల ప్రాంతంలో వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: