చంద్రబాబునాయుడు ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి. తానేమనుకుంటే యావత్ దేశమూ అదే అనుకోవాలని, దాన్నే ఫాలో అవ్వాలని అనుకుంటుంటారు. తాను అనుకోవటం వరకూ తప్పులేదు. కానీ అందరూ అదే అనుకోవాలని, దాన్ని ఫాలో అవ్వాలని అనుకోవటంతోనే సమస్య వస్తోంది.  ఈరోజు విశాఖపట్నంకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలట. ఎందుకంటే, ఏపికి మోడి చేసిన అన్యాయనానికి నిరసనగానట.

 Image result for chandrababu and tdp black shirts

చంద్రబాబు ఆదేశాలతో తమ్ముళ్ళు నల్ల చొక్కాలతో రోడ్డెక్కారు. ఎక్కడో విశాఖపట్నం కు మోడి వస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల వల్ల ఏమిటి ఉపయోగం ? ఆ విషయాన్ని చంద్రబాబును అడక్కూడదు. అడిగితే మోడితో కుమ్మకై కుట్ర చేస్తున్నారని మండిపోతారు. నిజం చెప్పాలంటే నాలుగేళ్ళ పాటు ఎన్డీఏతో అంటకాగినపుడు ఏపికి మోడి చేస్తున్న అన్యాయం చంద్రబాబుకు కనబడలేదు. ఎప్పుడైతే ఎన్టీఏలో నుండి బయటకు వచ్చేశారో వెంటనే మోడి ఏకి ద్రోహి అయిపోయారు.

 Image result for chandrababu navanirmana deekshalu

తాను నరేంద్రమోడిని వ్యతరేకిస్తున్నారు కాబట్టి (బిజెపిని కాదు) అందరూ వ్యతిరేకించాల్సిందేనని చంద్రబాబు ఆలోచన. జనాలందరూ మోడిని నిజంగా వ్యతిరేకించాల్సిన పరిస్ధితే వస్తే  చంద్రబాబును కూడా వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే నాలుగేళ్ళ పాటు ఇద్దరూ కలిసే ఏపిని నిలువునా ముంచారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలను మోడి పట్టించుకోలేదు. దాంతో మోడిని వ్యతరేకిస్తున్నారు చంద్రబాబు.

 Image result for chandrababu and tdp black shirts

తాను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అందరూ వ్యతిరేకించాలంటే జనాలేమన్నా పిచ్చోళ్ళా. తమ్ముళ్ళకు తప్పదు కాబట్టి నల్లచొక్కాలేసుకుని రోడ్లెక్కారు. మొన్న గుంటూరుకు వచ్చినపుడు కూడా మోడిని వ్యతిరేకిస్తు నల్లచొక్కాలేసుకున్నారు తమ్ముళ్ళు. ఏం జరిగింది ? మోడి వచ్చారు, బహిరంగసభలో పాల్గొని చంద్రబాబుతో పాటు లోకేష్ ను కూడా అమ్మనాబూతులు తిట్టేసి వెళ్ళారు. ఈరోజు రాత్రి విశాఖపట్నం సభలో కూడా జరిగేదదే.

 Image result for chandrababu dharmaporata deekshalu

పోయిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నవనిర్మాణ దీక్షల పేరుతో కాంగ్రెస్ పార్టీని తిడుతూ కాలం గడిపేశారు. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన దగ్గర నుండి ధర్మపోరాట దీక్షల పేరుతో మోడిని తిడుతున్నారు. అంటే కారణం ఏదైనా కానీండి ప్రత్యర్ధులను తిట్టటానికే చంద్రబాబు వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని తగలేస్తున్నది వాస్తవం. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ? కేవలం వ్యక్తిగత ఇమేజి పెంచుకోవటానికి తప్ప ఇంకెందుకు పనికారాదన్నది వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: