ఈ ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుక కూడా న్యాయం గురించి మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. కర్నూలు జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఫిరాయింపు ఎంపిలో టెన్షన్ పెట్టేస్తోంది. కర్నూలు ఎంపి సీటును కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి చంద్రబాబు ఎప్పుడో రిజర్వ్ చేసేశారు. ఆ విషయం తెలిసిన తర్వాత కూడా బుట్టా ఇంకా కర్నూలు ఎంపి సీటు గురించే పాకులాడుతోంది. ఈరోజు ఉదయం చంద్రబాబును కలసిన బుట్టా కర్నూలు సీటు తనకే కావాలని అడగటమే విచిత్రం.

 

తాను టిడిపిలోకి చేర్చుకునేటపుడు కర్నూలు ఎంపి సీటు తనకే ఇస్తానని మాట ఇచ్చారు కాబట్టి న్యాయం చేయాలని బుట్టా అడగటమే పెద్ద జోక్. చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని బుట్టా అనుకోవటమే విడ్డూరంగా ఉంది. మాట నిలబెట్టుకోవటం, న్యాయం చేయటం, నమ్మిన వాళ్ళను ఆదుకోవటం లాంటి లక్షణాలు చంద్రబాబు డిక్షనరీలోనే లేవన్న విషయం బుట్టాకు తెలీదేమో .

 

పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన బుట్టా టిడిపిలోకి వెళ్ళేముందు న్యాయం గురించి ఆలోచించారా ? టిడిపిలోకి ఫిరాయించటం ఆమె ఇష్టం. మరి ఫిరాయించిన తర్వాతైనా ఎంపి పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. నమ్మి టికెట్ ఇచ్చి గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డిని మోసం చేసిన బుట్టా ఇపుడు న్యాయం గురించి మాట్లాడటమే విచిత్రం. ప్రలోభాలకుగురై టిడిపిలోకి ఫిరాయించకుండా ఉండుంటే బుట్టా పరిస్ధితి ఇపుడు చాలా కంఫర్టబుల్ గా ఉండేదేమో. చూద్దాం ఫిరాయింపుల్లో ఇంకా ఎంతమంది న్యాయం కోసం చంద్రబాబును బ్రతిమలాడుకుంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: