భారతీయులందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.  ఏఐఎఫ్‌ వింగ్‌ కమాండర్ వర్ధమాన్‌ అభినందన్ ను భారత్‌కు పాకిస్తాన్ అప్పగించింది. వాఘా సరిహద్దుకు అభినందన్‌ వర్ధమాన్ చేరుకోవడంతో ఆయన రాకకోసం వేచి చూసిన వేలాది మంది భారతీయులు జైహింద్, భారత్‌ మాతాకీ జై నినాదాతో హోరెత్తించారు. బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పాక్ అధికారులు అభినందన్ కు ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ నిర్వహించి పత్రాలను పరిశీలించారు.  అనంతరం అతడికి సింగిల్ పేజీ వీసా మంజూరు చేశారు. 
Image result for abhinandan release
ముగ్గురు భారత అధికారుల సమక్షంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగింది.  వాఘా సరిహద్దు వద్దకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చేరుకుని అభినందన్‌కు చెందిన పౌర ధ్రువీకరణ, పాస్‌పోర్టు, సర్వీసు రికార్డుల పత్రాలను పాక్‌ విదేశాంగ అధికారులకు అందజేసి విడుదల చేసేందుకు ప్రాసెస్ ను పూర్తి చేశారు. పాకిస్తాన్ లోని భారత హైకమిషనర్‌ గౌరవ్‌ అహ్లూవాలియా వాటిని అధికారులకు అందజేశారు. వాఘా సరిహద్దుకు చేరుకున్న తర్వాత అభినందన్ కు వైద్య పరీక్షలు నిర్వహించి ఢిల్లీకి జీపులలో తీసుకుని వచ్చారు. 
Image result for abhinandan release
భారత్ లో అడుగుపెట్టేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో అభినందన్  భారత గడ్డపై కాలుమోపే అవకాశాలున్నాయి. తొలుత అభినందన్ ను ఢిల్లీకి తీసుకుని వచ్చి వైద్య పరిక్షలు చేయాలని భావించిన ప్రభుత్వం వాఘు సరిహద్దు వద్దే ఆయనకు వైద్య పరిక్షలు నిర్వహించింది. ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ పైలట్ అభినందన్ ను స్వాగతిస్తూ ప్రకటన చేసే అవకాశాలున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: