ఉగ్రమూకలకు అండదండలు, ఆర్థిక సాయాన్ని అందించడం నిలిపివేయాలని ప్రపంచ దేశాలకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు . ప్రపంచ దేశాల పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉండాలే తప్ప మతానికి కాదని వ్యాఖ్యానించారు.

Image result for sushma swaraj in OIC plenary

అరబ్-ముస్లిం దేశాలు యూఏఈ లోని అబుదాబిలో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక "ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ - ఓఐసీ" సదస్సుకు సుష్మ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడిన సుష్మ, దాయాది దేశం పాకిస్థాన్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు


ఇస్లాం శాంతిని ప్రబోధిస్తుందనీ, అల్లాహ్ కు ఉన్న 99 పేర్లలో ఎందులోనూ హింస లేదని పేర్కొన్నారు. ఋగ్వేదం ప్రకారం దేవుడు ఒక్కడేననీ, కానీ ఆయన్ను ప్రజలు రకరకాలుగా పూజిస్తారని చెప్పారు. ప్రపంచ స్థిరత్వం, శాంతి, సామరస్యం, ఆర్థిక పురోగతి కోసం ఓఐసీ చేస్తున్న ప్రయత్నానికి భారత్ మద్దతు ఇస్తున్నట్లు సుష్మా స్వరాజ్ తెలిపారు.

 Image result for sushma swaraj in OIC plenary

ఉగ్రదేశం పాకిస్తాన్ పేరును ప్రస్తావించకుండానే, ఉగ్రవాదంపై పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదని ఆమె తెలిపారు. ప్రధాని మోదీ తరఫున, 130 కోట్ల మంది భారత ప్రజల తరఫున ఆమె ఇస్లామిక్ దేశాల కూటమి (ఓఐసీ)కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌లో ముస్లింలు, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ తదితర భాషలు మాట్లాడగలరు. మతాలకు అతీతంగా భారతీయులు కలిసి జీవిస్తున్నారని ఆమె తెలిపారు. 


ఓఐసీ గౌరవ అతిథిగా యూఏఈ భారత్‌ను ఆహ్వానించడం పాకిస్థాన్‌కు మింగుడు పడలేదు. సుష్మా అతిథిగా వస్తే ప్లీనరీకి హాజరు కాబోమని బెదిరించింది. కానీ యూఏఈ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. దీంతో ఈ సమావేశానికి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఈ భేటీకి దూరమయ్యారు. ఈ సమావేశంలో సుష్మా స్వరాజ్ మాట్లాడటం టర్కీకి కూడా ఇష్టం లేదని ప్రచారం చేసింది. కానీ సంస్కరణలపై దృష్టి సారించిన కూటమి పాక్ బెదిరింపులను లైట్ తీసుకుంది. 
Image result for sushma swaraj in OIC plenary

భారత్‌తో యుద్ధం వస్తే ప్రపంచ దేశాలు హిందుస్థాన్‌ కు మద్దతు నిచ్చినా ఇస్లామిక్ దేశాల కూటమి, చైనా తనకు సపోర్ట్ చేస్తాయని ఇప్పటి వరకూ పాక్ భావిస్తూ వచ్చింది. కానీ ఆ దేశాన్ని ఇతర ముస్లిం దేశాలు పట్టించుకోక పోవడంతో పాక్ భ్రమలు మెల్లగా తొలగిపోయాయి. 50 ఏళ్ల తర్వాత ఇస్లామిక్ దేశాల కూటమి భారత్‌ కు ఆహ్వానం పంపడాన్నిపాక్ జీర్ణించుకోలేకపోతోంది. ఇస్లామిక్ దేశాల కూటమిలో 57 దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ దేశాల్లో 1.20 కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నారు.

Image result for pak opposed sushma in oic
ఇలా నీ, నా, తన, పర బేధం లేకుండా పాకిస్తాన్ కు వ్యతిరేఖంగా ప్రపంచ దేశాల సహాకారం సాధించటం ఉగ్రవాద శత్రుదేశం మెడలు వంచటానికి ప్రధాని నరేంద్ర మోడీ తొలి నుంచి ప్రయత్నిస్తూ వచ్చారు. ఇదొక అమేయమైన వ్యూహం. దేశ విభజన సమయంలో నాటి తొలి ప్రధాని ఈ దేశ శిరస్సుపై కాశ్మీర్ సమస్యను తల కొరివిగా పెట్టాడు. గత ఏడు దశాబ్ధాలుగా ఆ కొరివి రావణ కాష్టంలా రగులుతూ దేశాభివృద్ధికి గుదిబండలా తయారైంది. దాన్ని గత ఏడుదశాబ్ధాలుగా భరిస్తూ వస్తున్నా భారత్ అభివృద్ధికి శాంతికి అత్యంత ప్రమాదకరంగా మారగా ఈ దేశ ప్రధాని ఎవరూ ఈ పాపాన్ని కనీసం అదుపుచేయటానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఒక్క ప్రధాని నరేంద్ర మోడీ బృందం కూకటి వెళ్ళతో ఈ నెహౄ పాపాన్ని పెకలించ బూనటం ముదావహం.   

మరింత సమాచారం తెలుసుకోండి: