ఇపుడు ఎన్నికలకు ఏపీ రెడీ అయింది. మరో యాభై రోజుల్లో జనం తీర్పు వచ్చేస్తుంది. ఈ లోగా ఎవరి తోచిన జాతకాలు, జ్యోతిష్యాలు. చెబుతూ ఉంటారు. కొందరు సర్వేలు అంటూ హడావుడి చేస్తే మరి కొందరు జాతకాలు, గ్రహాలు అంటూ గెలుపు తీర్పులు చెబుతున్నారు. కానీ అసలైన తీర్పు మాత్రం జనం చెప్పాల్సింది ఉంది.


మళ్ళీ బాబేనట :


ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో మరో మారు తెలుగుదేశం పార్టీఅ అధికారంలోకి వస్తుందని ప్రభుత్వ  దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆస్థాన విద్వాంసుడు పూజ్యం విశ్వనాధ్ జోస్యం చెప్పారు. బాబు పార్టీకి వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్ల వరకూ వస్తాయని, వైసీపీకి 60 నుంచి 70 సీట్లు వస్తాయని, పవన్ జనసేన పార్టీకి 10 సీట్ల లోపు వస్తాయని ఆయన తన జాతకం గుట్టు విప్పేశారు. ఇక కేంద్రంలో రాహుల్ గాంధి ప్రధానిగా  అధికారంలోకి వస్తారని, కాంగ్రెస్ కి ఏకంగా 200 సీట్లకు పైగా వస్తాయని చెప్పేశారు. మరి ఎంతైనా ప్రభుత్వ జ్యోతీష్యుడు కదా ఆ గూటి పలుకే పలుకుతున్నారని సెటైర్లు  పడుతున్నాయి.


యుద్ధాలు వస్తాయట : 


ఇక దేశంలో యుధ్ధాలు వస్తాయని జూన్, జూలై నెలల్లో గడ్డు పరిస్తితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. దేశంలో ప్రక్రుతి విపత్తులు  కూడా సంభవిస్తాయని కూడా విశ్వనాధ్ చెప్పుకొచ్చారు. ఈసారి ఎండలు ఏప్రిల్లో ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో బాబు మళ్ళీ సీఎం అవుతారని చెప్పడంతో టీడీపీలో హర్షం వ్యక్తం అవుతొంది. సిమ్హాచలంలో నారసిమ్హ యాగం అయిదు రోజుల పాటు చేయించేందుకు వచ్చిన విశ్వనాధ్ మీడియాతో నాయకుల, పార్టీల జాతకల గురించి ఇలా చెప్పుకొచ్చారన్నమాట. అయితే ఆయన ప్రభుత్వ పదవిలో ఉండడం, గతంలోనూ బాబు మళ్ళీ సీఎం అంటూ చెప్పడం వల్ల ఆయన చెప్పిన తాజా  జాతకం మీద ఎవరి వాదనలు వారు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: