ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూ టర్నులు, పిల్లి మొగ్గల రాజకీయాలు అందరికీ ఎరుకే. ఆయన ఎవరినైనా సులువువా కామెంట్స్ చేసేయగలరు. చాలా కన్వీనియెంట్ గా ఎవరిక్తోనైనా పొత్తులు పెట్టుకోగలరు. దాన్ని తన మీడియా బలంతో గట్టిగా ఒప్పించేయగలరు కూడా. మరి ఆయన  రాజకీయ వైభవం అలాంటిది.


బాబు బాటలో  :


ఇక బాబు గారితో సావాసం చేసిన పుణ్యానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కి  కూడా  అవే వాసనలు వచ్చినట్లున్నాయని సెటైర్లు పడుతున్నాయి. లేటెస్ట్ గా పవన్ కడప టూర్లో చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల కోసం బీజేపీ యుద్ధాన్ని తెచ్చిందని పవన్ చేసిన వ్యాఖ్యలపై కమలనాధులు మండిపడుతున్నారు. ఈ విషయం తనకు రెండేళ్ల ముందే తెలుసు, ఓ బీజేపీ నేత చెప్పారంటూ పవన్ అనడం కొసమెరుపు. ఆ బీజేపీ నేత పేరు చెప్పలేనని కూడా పవన్ చెప్పడం మరో ట్విస్ట్. ఇక ఇది చూస్తూంటే సినీ నటుడు శివాజీ చెప్పిన గరుడ పురాణం గుర్తుకుతెస్తోంది. లేకపోతే ఎవరు చెప్పారో చెప్పరట. కానీ ఎన్నికల రాజకీయం అంటూ దేశభక్తికి ముడిపెడుతూ పవన్ కామెంట్స్ చేయడం విశేషం.


తేడాగా కామెంట్స్ :


అసలు దేశంలో జరుగుతున్న పరిణామాలపై పవన్ చేస్తున్న ఒక్కో కామెంట్ కూడా తేడాగానే ఉంటోందని అంటున్నారు. కర్నూల్లో ఆయన మాట్లాడుతూ తమకు కూడా దేశభక్తి ఉందని, అది బీజేపీ వాళ్ళ ఒక్కరి సొత్తు కాదని అన్నారు. ఇక ముస్లిములను దేశంలో విడదీయలేమని మరో మీటింగులో చెప్పారు. నిజానికి ముస్లింలకు  సర్జికల్ స్ట్రైక్ కి సంబంధం ఏంటో పవనే చెప్పాలి. తాను భిన్నమైన రాజకీయాలు చేస్తానని వచ్చిన పవన్ మైనారిటీ ఓట్ల కోసం ఇలా మాట్లాడడం తగునా అని కూడా విమర్శలు వస్తున్నాయి. 


ఇక చంద్రబాబు అయితే మోడీయే ఏమైనా చేయించి ఉంటారని, తన రాజకీయం కోసం ఏమైనా చేయగలరని చెప్పుకొచ్చారు. అదే మాటను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అన్నారు. మరో వైపు సీపీఎం కెరళ నాయకుడొకరు ఇది బీజీపీ ఎన్నికల రాజకీయం అంటూ సర్జికల్ స్ట్రైక్స్ మీద కామెంట్స్ చేశారు. వారంతా పాలిటిక్స్ లో పండిపోయి అవసరానికి తగినట్లుగా మాట్లాడుతారు. మరి పవన్  లాంటి వారు దేశ భక్తి నిండుగా ఉందని చెప్పుకున్న వారు ఇలా మాట్లాడమేంటని సెటైర్లు  పడుతున్నాయి. పవన్ పూర్వాశ్రమం టాలీవుడ్లో నటులంతా సర్జికల్ స్ట్రైకెస్ మీద హర్షం వ్యక్తం చేస్తే పవన్ ఇలా అనడం వింతే మరి. ఏది ఏమైనా మన కామెంట్స్ వల్ల సైనికుల ఆత్మ స్థైర్యం దెబ్బ తింటుందని పవన్ తో సహా నాయకులంతా గ్రహిస్తే మంచిది. పుల్వామా ఉగ్ర దాడులు ఎవరు చేశారో తెలుసుకుని మాట్లాడితే ఇంకా మంచిదని కూడా కమలనాధులతో సహా అంతా కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: