చూడబోతే ఫిరాయింపు మంత్రి ఆది నారాయణరెడ్డి వ్యవహారం అలాగే అనిపిస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోకి వైసిపి నేతలు అడుగుపెట్టాలంటే ముందుగా తన అనుమతి తీసుకోవాలన్నట్లుంది ఫిరాయింపు మంత్రి ఆలోచన. నియోజకవర్గంలో పర్యటించాలని అనుకున్న కడప మాజీ ఎంపి అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేయటమే ఇందుకు నిదర్శనం. అలాగే, జమ్మలమడుగు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకోవటంతో టెన్షన్ పెరిగిపోతోంది.

 

ఇక్కడ విషయం ఏమిటంటే, వైసిపి అంటే ఆదినారాయణరెడ్డి భయపడుతున్నట్లు కనబడుతోంది. లేకపోతే నియోజకవర్గంలో తిరగటానికి అధికార పార్టీ లేకపోతే పోలీసుల అనుమతో ఎందుకు తీసుకోవాలి. నియోజకవర్గంలో భారీ కార్యక్రమాలేమన్నా చేపడుతుంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వటం మాములే. అలాగే అవసరమైన బందోబస్తు కూడా అడుగుతారు. కానీ అసలు తిరగటానికే ఒప్పుకోవటం లేదంటే ఏమిటర్ధం ? ఇపుడే పరిస్ధితి ఇలాగుంటే ఇక ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఇంకెంత అన్యాయంగా వ్యవహరిస్తారో అన్న ఆందోళన పెరిగిపోతోంది.

 

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో కూడా టిడిపి నేతల పర్యటనలను ఎన్నడూ అడ్డుకోలేదు. టిడిపి నేతలు సమావేశాలు పెట్టుకునే వారు, సభలు కూడా నిర్వహించుకునే వారు. పైగా కాంగ్రెస్ నేతలను, ప్రభుత్వాన్ని కూడా విమర్శించేవారు. అయితే ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వం టిడిపి నేతల స్వేచ్చను హరించలేదు. మరి ఇపుడు ఫిరాయింపు మంత్రి ఎందుకు అలా చేస్తున్నారో అర్ధం కావటం లేదు. డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఫిరాయింపు మంత్రి ఓటమి ఖాయమన్నారు. ఇపుడే కాదు వైసిపి నేతలు ఎప్పుడు పర్యటనలు పెట్టుకున్నా టిడిపి ఇలాగే వ్యవహరిస్తోందంటే దేనికి సంకేతాలు ?


మరింత సమాచారం తెలుసుకోండి: