ఎక్క‌డ కొడితే.. దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. వైసీపీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌ను అక్క‌డే కొడుతున్నారు టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం, రాజ‌కీయ చాణిక్యుడు చంద్ర‌బాబునాయుడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం తిరిగి చేప‌ట్ట‌డం అనే విష‌యం చంద్ర‌బాబు నిజంగా చాలా చిన్న విష‌యం. ఇప్ప‌టికే ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 స్థానాలు టీడీపీ ఖాతాలోకి ఎన్నిక‌ల‌కు ముందుగానే చేరిపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న టీడీపీ విజ‌య‌సార‌ధులైన ఎమ్మెల్యేలకు ఈ వంద స్థానాల్లోనూ గెలుపు ఖాయం. ఇప్పుడు మ‌ళ్లీ వీళ్ల‌కే చంద్ర‌బాబు పెద్ద పీట వేశారు. సో.. ఎన్నిక‌ల‌కు ముందుగానే ఆయ‌న తన ప్ర‌భుత్వ ఏర్పాటును నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, ఇక్క‌డితే ఆగితే.. ఆయ‌న చంద్ర‌బాబు ఎలా అవుతారు?  రాజ‌కీయ చాణిక్యుడ‌నే పేరుకు సార్ధ‌క‌త ఎలా తెస్తారు? అందుకే ఆయ‌న త‌న వ్యూహాన్ని మార్చుకున్నారు. 


రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అంటూ ఏదీ ఉండ‌కుండా చేయాల‌ని, ముఖ్యంగా మిడిమిడి జ్ఞానంతో ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి ని కూడా అడ‌గడుగునా అడ్డుకుంటున్న జ‌గ‌న్‌కు చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 67కు ప‌రిమిత‌మైన జ‌గ‌న్ ముఠాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో 27కు ప‌రిమితం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌చంద్ర‌బాబు అత్యంత జాగ్ర‌త్త‌గా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌కు కంచుకోట వంటి ఆయ‌న సొంత జిల్లాలోనే టీడీపీ సైకిల్‌ను ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో క‌డ‌ప జిల్లాలో సీట్ల కేటాయింపును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డం, అభ్య‌ర్థుల మ‌ధ్య ఉన్న విభేదాల‌ను సాధ్య‌మైనంత మేర‌కు త‌గ్గించ‌డం వంటి కీల‌క అంశాల‌పై దృష్టి పెట్టి విజ‌యం సాధించారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు రామ‌సుబ్బారెడ్డిని నిల‌బెట్టారు. 


ఇక‌,ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు సాధించి, టీడీపీలో చేరిన మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డిని రాజంపేట ఎంపీగా పంపారు. ఇక‌, రైల్వే కోడూరు నుంచి సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుడు, చిత్తూరు ఎంపీ, న‌టుడు శివ‌ప్ర‌సాద్ అల్లుడు న‌ర‌సింహ ప్ర‌సాద్‌కు అవ‌కాశం ఇచ్చారు. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం, ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో వీరు త‌ల‌ప‌డేందుకు రెడీ ఉండ‌డం ఇక్క‌డ క‌లిసి వ‌స్తున్న ప‌రిణామాలు. ఇక‌, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క‌త్తుల్లాంటి నాయ‌కుల‌ను దింపాల‌ని నిర్ణ‌యించుకున్న చంద్ర‌బాబు ఆదిశ‌గా దృష్టి పెట్టారు.

దీంతో జ‌గ‌న్‌కు దిమ్మ‌తిర‌గడం ఖాయ‌మ‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. వాస్త‌వానికి క‌డ‌ప‌లోనూ అభివృద్ధి కార్య‌క్ర‌మాల జోరు భారీ ఎత్తున ఊపందుకుంది. సాక్షాత్తూ.. జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులకు నీరు అందించ‌డం, క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీకి శంకు స్తాప‌న‌, ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఎల్ ఈడీ వీధిదీపాలు, పల్లెల అభివృద్ధికి పెద్ద‌పీట వంటివి కూడా ఇక్క‌డ జ‌గ‌న్‌ను డిఫెన్స్‌లో ప‌డేస్తున్నాయి. చంద్ర‌బాబు వ్యూహానికి త‌గిన విధంగా జ‌గ‌న్ వ్యూహాలు వేయ‌గ‌ల‌రా? అనే సందేహం తెర‌మీదికి వ‌స్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: