ఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా టు డే 18వ కాంక్లేవ్ లో చంద్రబాబానాయుడు పరువును జాగన్ సాంతం తీసేశారు. దాదాపు గంటకుపైగా జరిగిన కాంక్లేవ్ లో వ్యాఖ్యాల అడిగిన అనేక ప్రశ్నలకు జగన్ సమాధానాలిచ్చారు. ప్రతీ ప్రశ్నకు చంద్రబాబు లాగ ’వాట్ అయామ్ సేయింగ్’ అంటూ అర్ధంకాకుండా చెప్పటంకాకుండా స్పష్టంగా చెప్పదలచుకున్నది చెప్పారు. ప్రశ్నని బట్టి సూటిగా సమాధానం చెప్పారు. పాదయాత్రపై అడిగిన ప్రశ్నకు తన అనుభవాలను వివిరంచారు. తాను సిఎం అయితే ఏం చేయాలనుకుంటున్నారో చెప్పారు. ప్రత్యేకహోదా పై తన స్టాండ్ ఏంటో వివరించారు.

 

అదే సమయంలో చంద్రబాబు తీసుకున్న యుటర్న్ లు, అవినీతి పాలన, అక్రమ సంపాదన, ఓటుకునోటు కేసులో చంద్రబాబు తగులుకున్న వైనం గురించి వివరించారు. వైఎస్ మరణం తర్వాత తనపై పడిన కేసులు, అందుకు కారకులు, కేసుల్లో మెరిటెంత ? సోనియాగాంధీని ఎదిరించి కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చిన అంశాలపై వేసిన ప్రశ్నలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఎక్కడా తొణక్కుండా, తొట్రుపాటు లేకుండా చెప్పదలచుకున్నది స్పష్గంగా  చెప్పారు.


ఓటుకునోటు కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు ఇరుకున్నట్లుగా దేశంలో మరే ముఖ్యమంత్రి ఇరుక్కోలేదని చెప్పారు. తెలంగాణా ఎంఎల్ఏ ఓటును కొనుగోలు చేయటంలో బ్లాక్ మనీని ఉపయోగించేటపుడు పట్టుబడిన చంద్రబాబు కూడా నీతులు చెబుతున్నట్లు ఎండగట్టారు. నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన అవినీతి, చంద్రబాబు మద్దతుదారుల అవినీతి గురించి కూడా క్లుప్తంగా వివరించారు.  తాను అధికారంలోకి వస్తే కేంద్రంలో ఎవరికీ మద్దతుగా ఉండనని మరోసారి స్పష్టం చేశారు. ఏపికి ఎవరైతే ప్రత్యేకహోదా ఇస్తానని చెబుతారో వారికే వైసిపి మద్దతుంటుందన్నారు. తనకు ఏపి, ప్రత్యేకహోదానే ముఖ్యమని జాతీయస్ధాయిలో తేల్చిచెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: