మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కళా వెంకట్రావు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ఓం హర శంభోశంకరా... శ్రీశైల మల్లన్నా పాహిమాం.. పాహిమాం అంటూ పురవీధుల్లో సాగిలపడ్డారు. గిరి కొండల్లో వెలసిన భ్రమరాంబా సమేత శ్రీమల్లికార్జున స్వామిఅమ్మవార్లు గురువారం రాత్రి   మయూర వాహనంపై ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. 
Image result for మల్లికార్జున స్వామిఅమ్మ
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులు అప్పుడే బారుతు తీరుతున్నారు. శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కళా వెంకట్రావు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించగా ఆయన వెంట ఈవో శ్రీరామచంద్రమూర్తి, ధర్మకర్తలమండలి అధ్యక్షుడు వంగాల శివరామిరెడ్డి పాల్గొన్నారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం కళా వెంకట్రావు దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. 
Image result for srisailam mallanna
వేదమంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు  శాస్త్రోక్తంగా వాహన పూజలను నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు మంత్రి దంపతులకు వేదాశీర్వచనం చేయగా, ఈవో స్వామివార్ల చిత్రపటం, శేషవస్త్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ రాష్ట్రంలో అధికారంలో చేపట్టాలని స్వామివారిని కోరుకున్నట్టు మంత్రి కళా వెంకట్రావు ఈసందర్భంగా చెప్పారు.   ఈ గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించి పునీతులయ్యారు . మాఘమాసంలో శివుడిని  బిల్వదళాలతో పూజించిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో ఉంది.

దీంతో మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినం రోజున ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసిన శ్రీశైలమల్లికార్జునస్వామివార్లను అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీభ్రమరాంబాదేవిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి పాదయాత్రతో భక్తులు చేరుకుంటుంటారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శుక్రవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు రావణవాహనంపై గ్రామోత్సవం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: