గతమెంతో ఘనం. వర్తమానం శూన్యం. భవిష్యత్తు అంధకారం. ఈ మూడు పదాలు అచ్చంగా ఓ పార్టీకి ఇపుడు సరిపోతాయి. ఎన్నో వైభవాలను చూసింది. ఎంతో ఎత్తులను తాకింది. ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్ధులను చిత్తు కూడా చేసింది. అన్నీ అంచులూ దాటేశాక ఇక చివరికి మిగిలిందేమిటి..


ఉనికి పాట్లు :


గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఏపీలో చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ  ఇపుడు ఉనికి పాట్లు పడుతోంది. ఎంతలా అంటే మేమూ ఉన్నామంటూ డప్పుకొట్టుకుంటోంది. గత నెల 19న అనంతపురంలో కాంగ్రెస్ బస్సు యాత్ర మొదలైంది. రేపు శ్రీకాకుళంలో ఆ యాత్ర ముగుస్తోంది. ఇందులో విశేషం ఏముంది అంటే కాంగ్రెస్ లో మిగిలి ఉన్న కొందరు  నాయకులు హాయిగా జిల్లాలు చుట్టొచ్చారు. వారు ఇంకా ఆ పార్టీలో ఉన్నారా అని కొన్ని చోట్ల జనం కూడా చూశారు. 
అంతే. దానికి మించి కాంగ్రెస్ కి ఏపీలో సీన్ కనిపించడంలేదు. ఆ పార్టీకి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి మాత్రం తామేదో పొడిచేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ జనంలో లేని పార్టీకి సారధినని మరచిపోయారు. తన ఉక్రోషాన్ని  ఇతర పార్టీల మీద తిట్ల రూపంలో మార్చి త్రుప్తి పడుతున్నారు.


గాలి తీసేసిన జగన్ :


ఏపీలో తూతూ మంత్రంగా సాగిన హస్తం పార్టీ యాత్ర గురించి ఎవరూ పట్టించుకోలేదు. రఘువీరా కామెంట్స్ ని కూడా లైట్ గా తీసుకుంటున్నారు. ఏపీకి టీడీపీ, వైసీపీ శని గ్రహాలు అంటూ ఈ రోజు విశాఖ మీడియా మీట్ లో విరుచుకుపడిన రఘువీరా అడ్డ గోలు విభజన చేసిన కాంగ్రెస్ ని జనం ఏనాడో వెలి వేసిన సంగతిని కన్వీనియెంట్ గా మరచిపొయారులా ఉంది. ఇక ఏపీలో ఈ మాటలు ఆయన అంటున్న టైంలోనే డిల్లీలో వైఎస్ జగన్ కాంగ్రెస్ గాలి తీసేశారు. 
ఆ పార్టీ ఏపీలో ఆవిరైపోయిందని సెటైర్లు వేశారు. మొత్తాని కి అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్లు ఏపీలో కాంగ్రెస్ కోమా దశ నుంచి కోలుకునే చాన్సే లేదని ఆ పార్టీ వారే డిక్లేర్ చేశేశారు. అందుకే వారంతా టీడీపీ, వైసీపీల్లోకి చేరిపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: