రహస్యాలు అంటేనే జాగ్రత్తగా ఉంచాలి. అలాంటిది అవి కనుక పోతే ఎంతటి నిర్లక్షంగా ఉంటున్నామో తెలుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఇపుడు ఏపీ కేంద్రంగా వస్తున్నాయి. లేటెస్ట్ గా ఏపీ రహ‌స్యాలు లీక్ అయ్యానని న్యూస్ ఇపుడు వైరల్ అవుతోంది.


కీలక డేటా చోరీ :


అసలు విషయానికి వస్తే  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటా మొత్తం చోరీకి గురైంది. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా మొత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో ఉన్నట్లు పోలీసులకు లేటెస్ట్ గా ఫిర్యాదు అందింది. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి దీని మీద సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లూ ఫ్రాగ్ మొబైల్స్ టెక్నాలజీ కంపెనీపై కేసు నమోదు చేసి, కూకట్‌పల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.


మొత్తం సమాచారం :


ఇక చూసుకుంటే   ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓటర్ కార్డు, ఆధార్ కార్డులు ఆ కంపెనీలో ఉన్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఆ కంపెనీకి చెందిన రెండు ప్రధాన కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మరి ఈ డేటాను ఎందుకు తీసుకున్నారు. దానికి ఎవరు సహకరించారు అన్నది విచారణలో తేలాల్సి వుంది. డేటా  చోరీ అంటే చిన్న విషయం కాదు. మరి చోరీకి పాల్పడిన వారిది ఎంత తప్పో, సర్కార్ వైఫల్యం కూడా అంతే తప్పు. దీని మీద దర్యాప్తు అధికారులు తేల్చితే కానీ అసలు గుట్టు బయటపడదు. ఓ వైపు చూస్తే ఎన్నికల వేళ, ఓట్లన్నీ సంక్షేమ  పధకాల  మీదనే ఆధారపడిన వేళ కీలకమైన డేటా చోరీ కావడం అంటే ఆలోచించాల్సిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: