ఎవరైనా రాజకీయాల్లో టికెట్స్ కోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఇక అధికార పార్టీ టికెట్ ఇస్తానంటే ఎగిరి గంతేస్తారు. కానీ ఏపీ లో సీన్ రివర్స్ లో కనిపిస్తుంది. రాజంపేట ఎంపీగా దివంగత డీకే ఆదికేశవుల నాయుడు తనయుడు డీకే శ్రీనివాసులను చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ఖరారు చేసినట్టుగా కొన్నాళ్ల కిందటే వార్తలు వచ్చాయి. అభ్యర్థు ఎంపిక ఎంపిక విషయంలో బాబు దూకుడు వెళ్తూ ఉన్నారని.. రాజంపేట ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లకు, నెల్లూరు ఎంపీ సీటుకు, దాని పరిధిలోని అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను చకచకా ఖరారు చేస్తున్నారు బాబుగారు.. అని అనుకూల మీడియా ప్రచారం చేసింది.

Image result for chandra babu

అయితే.. ఇప్పుడు అసలు ట్విస్టులు బయటకు వస్తున్నాయి. రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు డీకే శ్రీనివాసులు నాయుడు ససేమేరా అంటున్నారని సమాచారం! రాజంపేటలో పోటీ చేసేది ఓడిపోవడానికే అని.. అలాంటి చోట తాము ఎందుకు పోటీ చేస్తామని వారు అంటున్నారట. ఇక నెల్లూరు ఎంపీ సీటు విషయంలో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేరు ఖరారు అయిపోయిందన్నారు.

Image result for chandra babu

అయితే.. ఇప్పుడు మళ్లీ వెతుకులాట మొదలైందట. ఆఖరికి మాగుంటను బరిలోకి దించడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారట. మాగుంట కూడా అందుకు రెడీగా లేరని స్పష్టం అవుతోంది. ఒంగోలు ఎంపీ సీటుకు కూడా ఏవేవో లెక్కలు వేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఎంపీ సీటుకు అభ్యర్థిని రెడీ చేసుకోవడం అంత తేలికగా కనిపించడం లేదు. అంతేకాదు.. తిరుపతి ఎంపీ సీటు పరిధిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: