తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉందని చెప్పక తప్పదు. కనీసం 2014 పోటీ చేసిన ఎంపీలు కూడా మేము పోటీ చేయమని బాబు కు చెప్పడం ఇప్పుడు బాబు ను కలవర పెడుతుంది. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంపీగా ఉండబట్టి పదేళ్లు అవుతున్నా.. కనీసం ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా వచ్చిన నేపథ్యం లేదు ఈయన. ఏదో టీడీపీకి అత్యంత అనుకూలమైన సీటు, కులం ఈక్వెషన్లు తనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి.. తనే గెలుస్తాననే ధీమాతో ఈయన ఎంపీగా ఉన్నా లేనట్టే అన్నట్టుగా వ్యవహరించారు.


ఇదేంటి చంద్ర బాబు టికెట్ ఇస్తానంటే వారు మాత్రం వద్దంటున్నారు ..!

ఇక అనంతపురం ఎంపీ దివాకర్ రెడ్డి తన తనయుడికి టికెట్ ఇవ్వాలని అంటున్నారు. అయితే తనయుడు అయితే గెలుపు కష్టమని జేసీనే పోటీలో నిలబడాలని బాబు ఒత్తిడి తెలుస్తున్నారట! ఇక చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విషయంలో బాబుకే అంత సానుకూల అభిప్రాయం లేదు. శివప్రసాద్ ను పక్కన పెట్టేయాలనే అనుకున్నారు మొదట. అయితే ఆయన కాదంటే.. కనీసం ఆ స్థాయి క్యాండిడేట్ కష్టం అవుతోంది. దీంతో శివప్రసాద్ కే టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.


ఇదేంటి చంద్ర బాబు టికెట్ ఇస్తానంటే వారు మాత్రం వద్దంటున్నారు ..!

ఇక ఇటు వైపుకు వస్తే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా పోటీకి అయిష్టమే అని తేలిపోయింది. ఆయన కూడా ఎమ్మెల్యేగా టికెట్ కావాలని అంటున్నారట. అయితే ఎంపీగా పోటీచేసేందుకు అచ్చెన్నాయుడు రెడీనా అనేది ఇంకా కొశ్చన్ మార్కే! విజయనగరం ఎంపీ అశోక్ గజపతి రాజు కూడా ఈసారి పోటీకి సమ్మతంతో లేరట. ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుతూ ఉన్నారట. ఇక తాజాగా చేతులు ఎత్తేసిన వారి జాబితాలో మురళీమోహన్, కొనకళ్ల నారాయణ రావుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. పార్టీ తరఫున మిగిలిన పదమూడు మంది ఎంపీల్లో.. ఇలా ఆరుమంది సిట్టింగ్ ఎంపీలు తాము పోటీచేయడానికి సిద్ధంగా లేమని చెబుతుండటం అంటే ఇది చిన్న విషయమా? 


మరింత సమాచారం తెలుసుకోండి: