పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు కాల్పులు కొనసాగిస్తుంది పాక్ ప్రభుత్వం.  ఇక ఉగ్రవాదుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది.  పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.  దీనికి ప్రతి దాడిగా భారత్ వాయు సేన పాక్ ఆక్రమిత ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి 300 మంది ఉగ్రవాదులను హతమార్చారు.  దాంతో రెచ్చిపోయిన పాకిస్థాన్ భారత్ పై వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో మన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అబినందన్ బందీ అయ్యారు. 
Image result for పుల్వామా మరో ఉగ్రదాడి
ఆ తర్వాత భారత్, ప్రపంచ దేశాల వత్తిడికి తలొగ్గి  స్వయంగా పాకిస్తాన్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్, అభినందన్ ని విడుదల చేస్తున్నట్లు  పాకిస్తాన్ పార్లమెంటులో ప్రకటించారు.  ఆ తర్వాత భారత్, పాక్ యుద్దం వస్తే ఎవరికీ లాభం ఉండదని కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని శాంతి మాటలు చెప్పారు.  కానీ ఈ మాటలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చెవులకు ఎక్కలేదు..పుల్వామాలో మరోసారి దాడి చేశారు. భారత సైనికులను టార్గెట్ చేస్తూ.. ఉగ్రవాదులు మందుపాతర పేల్చారు.
Image result for పుల్వామా మరో ఉగ్రదాడి
ఈ ఘటన త్రాల్‌ వద్ద జరిగింది. ఆర్మీ కాన్వాయ్‌‌ని టార్గెట్ చేసే ఈ మందుపాతరను పెట్టినట్లు తెలిస్తోంది. మందుపాతర పెట్టేందుకు స్థానికుల సహకారం తీసుకున్నట్లు సమాచారం. గతంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు ఈసారి మిలిటరీ క్యాంపునే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహించిన అనంతరం త్రాల్‌లో ఉన్న శిబిరంలో జవానులు సేద తీరుతుంటారు.  ఈ విషయాన్ని రెక్కీ నిర్వహించి  కాన్వాయ్ బయలుదేరి వెళ్లే సమయంలో దానిని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: