తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాజకీయాలు బహు చిత్రం. ఆయనకు అనుకూలమైందే తీసుకుంటారు. వ్యతిరేకమైంది ప్రత్యర్ధులకు తగిలించేస్తారు. తప్పులన్ని ఇతరులవి, ఒప్పులు మాత్రం తనవి, ఈ తరహా రాజకీయాలోతోనే ఆయన జీవితం మొత్తం సాగిపోతోంది. తాజాగా బాబు చేస్తున్న కామెంట్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీకి తగినట్లుగా లేవు.


మోడీ మీద అక్కసుతో :


నాలుగేళ్ళ పాటు బీజేపీని మోసినపుడు మోడీ దేవుడు. ఆయన తప్ప ఎవరూ దేశానికి నాయకుడే లేరు. ఇపుడు బయటకు వచ్చాక మోడీ శత్రువైపోయారు. అంతే ప్రతీ విషయాన్ని మోడీకి అంటగట్టి నానా యాగీ బాబు చేస్తున్నారు. ఇక తాజాగా బాబు గారు ఓ అడుగు ముందుకేసి పుల్వామా దాడుల వైఫల్యం అచ్చంగా మోడీదేనని అన్నారు. అంతటితో వూరుకోకుండా ఇంటెలెజెన్స్ ఫెయిల్యూర్ అంటూ బండలు వేశారు. అందువల్ల అమాయక జవాన్లు ఉగ్ర దాడిలో చనిపోయారని బాబు అటాక్ చేశారు. దానికి బాధ్యునిగా మోడీ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.


సర్జికల్ స్ట్రైక్స్ ఘనత వాళ్ళదే :


ఇక మరో వైపు పాక్ భూ భాగంలోకి వెళ్ళి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సైనికులదే ఆ విజయం అన్నారు. వారు ధీరోదాత్తులంటూ ప్రశంసలు కురిపించారు. ఓ విధంగా సైనికులదే  ఈ విజయం అనుకున్నా రాజకీయ సంకల్పం లేకపోతే వారు స్వేచ్చగా అక్కడకి వెళ్లి దాడులు చేయగలరా. ఒకవేళ ఆ మెరుపు దాడులు విఫలమైతే ఆ తప్పు ఎవరిదవుతుంది. ఇది కూడా బాబు గారు చెప్తే బాగుంటుంది. ప్రతీదీ రాజకీయం చేస్తున్న చంద్రబాబు 2008 ముంబై పేలుళ్ళపుడు 166 మంది చనిపోయారు. నాడు ఏ దాడులు చేయకుండా మౌనం వహించిన నాటి యూపీయే తో ఇపుడెలా అంటకాగుతున్నారో చెబితే బాగుంటుంది.
నాడు కూడా సైనికులు తమకు స్వేచ్చ ఇస్తే ఉగ్ర శిబిరాలపై అటాక్స్ చేస్తామని అర్ధించారు. మరి నాటి మౌన ముని మన్మోహన్ ఏమీ చేయలేక చేతులెత్తేశారు తప్ప అనుమంతించలేదే. మరి మన్మోహన్, మోడీల మధ్య ఈ తేడాను గుర్తించడానికి బాబుకు ఇగో అడ్డువస్తోంది. రాజకీయ శత్రుత్వం కూడా మాట పెగలనీయడంలేదులా ఉంది.


ఇక్కడా అంతేనా :


ఈక ఏపీలో గోదావరి పుష్కరాల టైంలో ఏకంగా 39 మంది వరకూ అమాయక భక్తులు చనిపోయారు. దానికి బాధ్యత ముఖ్యమంత్రిగా బాబు తీసుకున్నారా. క్రిష్ణా నదిలో పడవ ప్రమాదంలో అనేకమంది చనిపోయారు, దానికి బాబు బాధ్యత వహించారా. మరి తాను మాత్రం ఒప్పుల కుప్పలా చెప్పుకుంటున్న బాబు మోడీని అనే హక్కు ఎలా కలిగి ఉన్నారో సమాధానం చెప్తే బాగుంటుంది. ఎన్నికలు రాజకీయాలు వేరు. దేశ రక్షణ వేరు. సీనియర్ పొలిటీషినన్ గా బాబుకు ఇది తెలియదా. తైలిసే  ఇలా వ్యవహరిస్తే  మాత్రం బాబు పెద్ద పొరపాటే చేస్తున్నారు. ఇది నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: