అధికారంలో ఉన్నవాళ్ళు ఎవడి స్వార్ధం వారు చూసుకుంటున్న పరిస్థితులో ఏపిలో కమ్ముకున్నట్లున్నాయి. ఈ వార్తే కనుక నిజమైతే ఆంధ్ర ప్రదేశ్ అంతా అరాచకం తాండవిస్తున్నట్లే! ఈ వార్త నిజం గానే ఇప్పుడు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంబంధించిన అనేక కీలక సమాచారమంతా ఇప్పుడు ఒక ప్రైవేటు కంపెనీకి చేరిపోయాయట. 


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుకుంటున్నా లబ్ధిదారుల కుటుంబాలు వారి వివరాలతో పాటు మరింత కీలకమైన సమాచారం అదే ప్రైవేట్ కంపెనీలో ఉన్నట్లుగా ఋజువైంది. ఈ మేరకు ఆ ప్రైవేట్ కంపెనీ పై అందిన పిర్యాదులపై పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది. ఇక పోలీసుల దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించిన అసలు రహస్యం గుట్టు రట్టు కాబోతొందని వార్తలు వినిపిస్తున్నాయి. 


అయినా ఒక రాష్ట్ర ప్రభుత్వం వద్ద నున్న ఆ రాష్ట్ర ప్రజల కీలక సమాచారం ఒక ప్రైవేట్ కంపెనీ కార్యాలయానికి ఎలా చేరాయన్న ప్రశ్నలు అందరికి ఆసక్తితో పాటు భయాన్నిరేకెత్తిస్తోంటే, అసలు గుట్టురట్టు అవడం రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ కొంప ముంచేలాగా ఉందన్న వాదన వినిపిస్తోంది.  ఈ సమాచార రహస్యం బట్టబయలై ప్రకంపనలు చెలరేగటానికి కారణం వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు అని అంటున్నారు. అయితే ఈ పిర్యాదు పై విచారణ వేగం పుంజుకుంటే మాత్రం అధికార టీడీపీ నిజ నగ్న స్వరూపం బట్టబయలవ్వటం గ్యారెంటీ అన్న వాదనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి.
Image result for blue frogs mobiles tech company
అసలు విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల లబ్దిదారుల సమాచారం మొత్తం చోరికి గురైందని, అదీ ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన కార్యాలయంలో ఈ డేటా నిక్షిప్తమై ఉందంటూ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడంతో, తెలంగాణాకు చెందిన సైబరాబాద్ పోలీసులు విచారణకై రంగంలోకి దిగేశారట. కూకటపల్లిలోని ఐటి గ్రిడ్ కంపెనీ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు, ఆ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 
Image result for AP voters lists theft case & cyberabad police investigation

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొందిన ప్రజల ఓటర్ కార్డు - ఆధార్ కార్డులు ఆ కంపెనీలో కుప్పలుతెప్పలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ కంపెనీకి చెందిన మరో కార్యాలయం లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఓటర్ల జాబితాల్లో మార్పులు జరిగినట్లు, వైరివర్గాల కు నమ్మకంగా ఓటేస్తారని భావిస్తున్న వారి ఓట్లను యుద్ధ ప్రాతిపథికపై తొలగించటం జరుగుతున్నాయంటూ కొంతకాలంగా ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తోంది.


దీనిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సీదాగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానంలోనూ పలుకేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఇలాంటి కీలక ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యఎన్నికల సమాచారం భద్రత పరంగా అత్యంత జాగ్రత్త వహించ వలసిన ఎంతో విలువైన వివరాలన్నీ, అదీ  కూడా ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఉన్నాయన్న విజయసాయిరెడ్డి ఫిర్యాదు, నిజంగానే పెనుసంచలనం సృష్టించటం  దురదృష్టకరం.


విజయసాయిరెడ్డి ఫిర్యాదు నిజమేనని పోలీసుల దర్యాప్తులో ఋజువైనదని సదరు కార్యాలయంలో ఈ డేటా ఉన్నట్లుగా పోలీసులు కూడా నిర్ధారించారన్న సమాచారం  చూస్తుంటే, ఆ కంపెనీకి ఈ డేటా అందించిన వారికి మాత్రం చట్టపరంగా ధారుణమైన దెబ్బ పడనుందన్న వాదన ఉన్నతవర్గాల్లో వినిపిస్తోంది. 
Image result for blue frogs mobiles tech company
ఈ తరహా కలకలం చెలరేగటానికి ముందుగా ఉదయం జరిగిన టెలీ-కాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత - రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైసీపీ నేతలు ఓటర్ల జాబితాల్లోని ఓట్లను తొలిగిస్తూ కుట్రలకు పాల్పడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారట. చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణలు చేసిన కొంత సేపటి కే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఒక ప్రైవేట్ సంస్థలో ప్రభుత్వం వద్ద అత్యంత భధ్రత నడుమ ఉండాల్సిన అతి ముఖ్యమైన సమాచారం దొరకటం కలకలం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: