ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నేడో రేపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తూంటే నెతలు ఎవరి మటుకు వారు తమ దారులు వెతుక్కుంటున్నారు. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ గోడ దూకుళ్ళ వల్ల పార్టీల బలం పెరుగుతోందా. తగ్గుతుందా అన్నది చూడాలి. 


రఘురామరాజు వెళ్తారా :


నర్సాపురానికి చెందిన కనుమూరి రఘురామరాజు వైసీపీలోకి వెళ్తారంటూ మళ్ళీ ప్రచారం ఊపందుకుంది. ఇంతకు ముందు ఆయన తాను చేరబోవడంలెదని చెప్పినా కూడా మళ్ళీ హడావుడి మొదలైంది. ఆయన్తో పాటుగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరుతారని అంటున్నారు. పశ్చిమ  గోదావరి జిల్లాలో వైసీపీ బలం పెంచుకోవడానికి రాజు గారి చేరిక ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక ఆయన నర్సాపురం ఎంపీ గా పోటీ చేస్తారని చెబుతున్నారు.


టీడీపీకి దెబ్బే :


ఇక రాజుగారు వైసీపీలో చేరితే టీడీపీకి గట్టి దెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు. ఆయన గతంలో వైసీపీలో నుంచే టీడీపీకి వెళ్లారు. గత ఎన్నికల్లో ఇక్కడ  టీడీపీ బీజేపీ పొత్తు వల్ల బీజేపీకి టికెట్ ఇచ్చారు. దాంతో రాజు గారికి అకాడిమేట్ చేయలేకపోయారు. మరి ఇపుడు చూస్తే ఆయన టీడీపీని వీడాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. టికెట్ పై ధీమా లేకనా, లేక పార్టీ గెలుపుపై అనుమానమా అన్నది తెలియాలి. మొత్తానికి ఆయన కనుక వైసీపీలో చేరితే టీడెపీఎకి భారీ నష్టమే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: