ఎన్నికలు దగ్గర పడడంతో చంద్రబాబులో భయాలు పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో, దాంతో ఆయన తనదైన రాజకీయాలు చేస్తున్నా,  అనుకూల మీడియా  మద్దతు భారీగా ఉన్నా ఎందుకో అంతగా కలసిరావడంలేదు. ఈ పరిణామాలాతో బాబు మరింతలా  అభద్రతాభావంలోకి వెళ్ళిపోతున్నారు. ఆయన లేటెస్ట్ కామెంట్స్ ఆ సంగతే చెబుతున్నాయి.


మోడీపై బురద ;


సరిహద్దులో ఈ మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తలు పెరిగాయి. గత నెల 14న పుల్వామా ఉగ్ర దాడి తరువాత దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దానికి ప్రతిగా అదే నెల 26న జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తో దేశంలోని పౌరులలో దేశభక్తి ఒక్కసారిగా ఉప్పొంగింది. ఇక పాక్ చెరలో ఉన్న మన పైలెట్ అభినందన్ని రెండు రోజుల తేడాలో విడిపించడం కూడా భారత్ దౌత్య విజయం. ఇలా రెండు విజయాలు ఇపుడు ఎవరి ఖాతాలోకి వెళ్తాయన్నభయం మోడీ వ్యతిరేక కూటమిలో ఒక్కసారిగా  పట్టుకుంది. దాంతో పుల్వామా దాడులపైన అనుమానాలు వ్యక్తం చేసే వారు ఎక్కువైపోయారు. పదే పదే అది మోడీ ఫెయిల్యూర్ గా చిత్రెకరిస్తున్నారు.


బాబు ముందున్నారు :


ఈ విషయంలో చంద్రబాబు చాలా ముందున్నారు. ఆయన ఇతర రాజకీయ నాయకుల కంటే కూడా ఇపుడు మోడీని ఎక్కువగా ద్వేషిస్తున్నారు. నాలుగేళ్ల పాటు మిత్రులుగా ఉన్న తరువాత తేడా ఏం కొట్టిందో తెలియదు కానీ బాబు మోడీ ఇక వద్దు అంటున్నారు. కానీ చూడబోతే మోడీకి దేశంలో మద్దతు ఇపుడు ఒక్కసారిగా పెరిగింది. పాక్ మీద మెరుపు దాడులు చేసి పీచమణించింది మన జవాన్లు అయినా రాజకీయ సంకల్పం బీజేపీది, ప్రత్యేకించి మోడీది అని నమ్ముతున్నవారు దేశమంతా ఉన్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలోనూ జవాన్లు ఉన్నారు. కానీ ఇలా పాక్ కి దెబ్బకు దెబ్బ తీయడం  అప్పట్లో ఎక్కడా జరగలేదు. దాంతో మోడీ వ్యతిరేకులు ఎంత కాదన్నా ఆ క్రెడిట్ అచ్చంగా ఆయన ఖాతాలోకే పోతోంది.


జోస్యం చెప్పిన టీడీపీ ఎంపీ :


ఈ సంగతి ఏకంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి చెబుతున్నారు. మోడీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందని లేటెస్ట్ గా జేసీ చేసినా కామెంట్స్ బాబును గంగవెర్రులెక్కించేవే. పరిస్థితి ఇలాగే ఉంటే మోడీ మరో మారు ప్రధాని కావడం ఖాయమని జేసీ జాతకం చెప్పేశారు. నిజానికి ఈ విషయం బాబుకు కూడా బాగానే అర్ధమవుతోంది. అందువల్లనే ఆయన మోడీ మీద బురద జల్లే సరికొత్త కార్యక్రమానికి దిగిపోయారు. పాక్ మీద యుద్ధం అంటూ ఘాటు  వ్యాఖలు చేస్తున్నారు. నిజానికి పాక్ మీద యుద్ధం జరలేదు. అక్కడ ఉన్న ఉగ్ర శిబిరాల మీద మెరుపు దాడులు మాత్రమే జరిగాయి. మరి ఆ విషయంపై ఫార్టీ యియర్స్ బాబు మాటలు, ఇపుడే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ మాటలు ఒకేలా ఉండడం విశేషం. 


యుద్ధం రాకుండానే వచ్చిందని పవన్ అంటే అదే మాట బాబు పదే పదే అంటున్నారు. నిజానికి యుధ్ధం ఏదీ లేదక్కడ. కేవలం మెరుపు దాడులు మాత్రమే జరిగాయి.  దీన్ని బట్టి చూస్తే మోడీకి అంతటా అనుకూలిస్తున్న పరిస్థితులు ఇపుడు బాబును తెగ కంగారు పెడుతున్నాయనుకోవాలి. అందువల్లనే ఆయన పొంతల లేని మాటలు మాట్లాడుతూ దేశ రక్షణను సైతం రాజకీయం చేస్తున్నారు. అయినా ఇపుడు ఎవరేంటో దేశం మొత్తం చూస్తోంది. నిజానికి సరి హద్దుల్లో ఉద్రిక్తలు లేనపుడు కూడా ఈ దేశంలో మోడీ వైపే మెజారిటీ ఓటర్లు ఉన్నారని అనేక సర్వేలు చెప్పాయి. ఇపుడు పెరిగిన ఇమేజ్ తో మోడీ మళ్ళీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే బాబుకు పట్టుకున్న అసలైన భయం. అందులో నుంచే అయన పస లేని  కామెంట్స్ చేస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి.
.


మరింత సమాచారం తెలుసుకోండి: