Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 9:20 pm IST

Menu &Sections

Search

సీమలో ఎవరి సీన్ ఎంత...!!

సీమలో ఎవరి సీన్ ఎంత...!!
సీమలో ఎవరి సీన్ ఎంత...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వచ్చే ఎన్నికల్లో సీమ జిల్లాలు చాలా కీలకమైన పాత్ర పోషించనున్నాయని అర్ధమవుతోంది. ఎందుచేతంటే అక్కడ నుంచే జగన్, చంద్రబాబు వచ్చిన వారు. ఇద్దరూ అధికారం గట్టిగా  కోరుకుంటున్న పరిస్థితుల్లో సీమ ఫ్యాక్టర్ ఇపుడు కేంద్ర బిందువుగా ఉంది. సీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉన్న జిల్లాలు ఇవి.


గోడ దూకుళ్ళతో బలమా :

tdp,-ycp,-rayala-seema-politics

గత ఎన్నికల్లో ఇక్కడ ఉన్న మొత్తం 52 అసెంబ్లీ సీట్లకు గాను ఇక్కడ  వైసీపీ 30 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 22 సీట్లు దక్కుంచుకుంది. టీడీపీని ఒక్క అనంతపురం జిల్లా ఆదుకుంది. కర్నూలు, కడప, చిత్తూరు వైసీపీలో బాగా ఎక్కువ సీట్లు లాగేసింది. దాంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరుసటి రోజు నుంచే ఇక్కడ గురి పెట్టారు. మెల్లగా పెద్ద నాయకులను టీడీపీ గూటికి తెచ్చేశారు. శాశ్వత ప్రత్యర్ధులను సైతం ఒకే పార్టీలోకి తెచ్చేశారు. దాంతో బలం ఎంత పెరిగిందో అంత అసమ్మతి కూడా రాజుకుంది.


కోట్ల చేరిక సభపై చెప్పు :

tdp,-ycp,-rayala-seema-politics

ఇక కోట్ల సూర్యప్రకాశరావు కుటుంబం టీడీపీలో నిన్న చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు వేదిక మీద ఉండగానే చెప్పు ఒకటి వేదిక మీద పడింది. అక్కడ కోట్ల, టీడీపీ నేత కేయీ కుటుంబాల మధ్యన గొడవలు టాప్ రేంజిలో ఉన్నాయి. సీమలో చిత్రమేంటంటే నాయకులు కలసినా క్యాడర్ కలవదు. ఇప్పటికే కడపలో మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డిల మధ్యన గొడవలు పీక్స్ లో  ఉన్నాయి. ఇపుడు అదే కధ కర్నూల్లో కనబడుతోంది.


వైసీపీకి సంగతేంటి :

tdp,-ycp,-rayala-seema-politics

ఓ విధంగా చూసుకుంటే గత ఎన్నికల్లో పెద్ద నాయకులంతా ఆ పార్టీలో ఉన్నారు. దాంతో ఆ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. ఈసారి మాత్రం సీన్ మారింది. చాలా మంది సైకిలెక్కేశారు. అంతే కాదు కాంగ్రెస్ లో ఉన్న కోట్ల లాంటి వారు టీడీపీలో చేరారు. దాంతో టీడీపీకి కొత్త బలం వచ్చింది. ఇక పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. చిత్త్తూరులో అమరనాధరెడ్డి ఫ్యామిలీ కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళింది. ఇలా ఎక్కడకక్కడ వైసీపీకి కన్నం పడింది. మరి దాన్ని పూరించేందుకు జగన్ ఏం చేస్తున్నారో చూడాలి.

tdp,-ycp,-rayala-seema-politics

అయితే టీడీపీలో అసమ్మతి రేగడం, ఈ చేరికలు నాయకుల స్థాయిలోనే సఖ్యతగా ఉన్నట్లు కనిపిస్తున్నా క్యాడర్ వైపే ఇపుడు అందరి చూపు ఉంది. సహజంగా సీమ జిల్లాలలో  క్యాడర్ రాజకీయంగా విడిపోయి ఉంటాయి. అందువల్ల  క్యాడర్ మాత్రం తాము ఎపుడూ ఓటు వేయని టీడీపీకి వేయాలనుకోదు. ఇక వైసీపీకి కూడా ఇక్కడ బాగానే బలం ఉంది. అందువల్ల కిక్కిరిసిపోయినట్లు పైకి కనబడుతున్నా టీడీపీ బలం వాపు మాత్రమేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఈసారి 52 సీట్లకు నలభై వరకూ మేమే గెలుచుకుంటామని వైసీపీ అంటూంటే మాకే మెజారిటీ సీట్లు అని టీడీపీ అంటోంది. చూడాలి.


tdp,-ycp,-rayala-seema-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేయే పాల్.. నవ్వుల పాల్...!!
ఇదేంది జేడీ ఇలా ఐపోయావ్...!!
అక్కడ గెలుపు ఎవరిదో... పందేలకు షురూ..!!
నాడు ఎన్టీఆర్..నేడు జగన్....!!
ఎలమంచిలిలో రాజుగారికి ఇరకాటమేనా...!!
సింగిల్ గా వచ్చే వాడే హీరో...!!
తాట తీస్తా... తోకలు కట్ చేస్తా ....!
ఆయన్ని ఇంకా దారుణంగా తిడతారట...అదే వ్యూహం.. వర్కౌట్ అవుతుందా....!!
టీడీపీ కుంభస్థలం పైనే టార్గెట్...!!
ప్రభాస్ 20....2020 !!
పొలిటికల్ రీ ఎంట్రీ అంటున్న కలెక్షన్ కింగ్.......బస్తీ మే సవాలేనా...!!
విశాఖలో వింత రాజకీయం...!!
బాబు తమ్ముడు ఎక్కడున్నారు.. ఎలా ఉన్నారు...నార్నె షాకింగ్ కామెంట్స్...!!
విజయనగరంలో టీడీపీకి షాక్...!!
అమరావతి. పోలవరం... ఇంతేనా...!!
బాబుకు బాబు ఓపెన్ చాలెంజ్
వేవ్ ఉంటే  125... లేకపోతే  95... లెక్క పక్కా...!!
పాడేరులో జగన్నినాదం...!!
మాజీ జేడీ పెదవి విప్పాలట..!!
విశాఖలోనే మకాం... బాండ్ పేపర్ మీద రాస్తారట...!!
అసలికి కొణతాల రామకృష్ణ కధేంటీ?
పార్టీకి రిపేర్లు చేసుకుంటున్న అయ్యన్న...
జగన్... కింగ్... కింగ్ మేకర్.....!!
నాడు అవినీతి... నేడు అరాచకం...!!
బాబుని వదిలేసిన పవన్....!!
మోహన్ బాబుని కెలుకుతున్న శివాజీ...!!
పశ్చిమాన పొడిచేదెవరో...!!
ఒక మంత్రి, ఇద్దరు రాజులు....!!
విశాఖకు చిన్నమ్మ... మ్యాజిక్ రిపీట్...?
దండం పెడతానంటున్న బాబు...అర్ధమైపోతోందా...!!
పవన్ ఆస్తులు 52 కోట్లు.. అప్పులు 32 కోట్లు ....!!
విశాఖ తూర్పులో బిగ్ ఫైట్ ..!!
దిగుమతి సరుకే దిక్కా పవన్...!!
ఎన్నికల టైంలో చిరు అక్కడేనట మకాం...!!
అనకాపల్లి బెల్లం ఎవరికి..!?
బాలయ్య మల్టీ స్టారర్...మరో హీరో ఆయనేనా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.