ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. నేతలు అటూ ఇటూ జంపింగ్ లు చేస్తున్నారు. ఎన్నికల టికెట్లు కూడా పార్టీల వారీగా ఖరారవుతున్నాయి. ఈ సమయంలో ఓ సర్వే సంస్థ చేపట్టిన పైనల్ ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. ఈ సర్వే వివరాలు ఓసారి చూద్దాం..



సాధారణంగా గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం కాబట్టి.. ఇక్కడ టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంతా ఊహిస్తున్నారు. కానీ అంచనాలకు భిన్నంగా ఇక్కడ వైసీపీ దూసుకుపోతోంది. మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ జిల్లాలో వైసీపీ 14 చోట్ల మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. మరో రెండు స్థానాల్లో సెకండ్ ప్లేస్‌లోనూ.. ఒక స్థానంలో థర్డ్ ప్లేస్‌లోనూ వైసీపీ ఉంది.



ఇక అధికారపార్టీ విషయానికి వస్తే.. ఇక్కడ కేవలం రెండు స్థానాల్లోనే టీడీపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. మరో ఆరు స్థానాల్లో సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. 9 స్థానాల్లో మూడో స్థానానికి దిగజారడం విశేషం. ఇక మరో పార్టీ జనసేన.. ఈ జిల్లాలో ఒక స్థానంలో ఫస్ట్ ప్లేస్ లో ఉందిమరో రెండు స్థానాల్లో సెకండ్ ప్లేస్‌లోనూ.. 14 చోట్ల ధర్డ్ పొజిషన్‌లోనూ ఉంది.

Related image


పోలింగ్ శాతం చూసుకుంటే.. టీడీపీకి 36 శాతం.. వైసీపీకి 42 శాతం.. జనసేనకు 19 శాతం వరకూ ఓటు శాతం ఉంది. అంటే ఫైనల్‌గా ఇదే పొజిషన్లు కేరీ అయితే.. ఇక్కడ వైసీపీ 14 స్థానాలు గెలుచుకుంది.. టీడీపీ 2, జనసేన ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సర్వే ఎంతవరకూ నిజమవుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: