చంద్రబాబునాయుడు అదిగో పులి అంటే ఇదిగో తోక అంటున్నారు. ఆయన కళ్ళతో చూసినది చెప్పడం లేదు, అంతే కాదు, అధారాలు దగ్గర ఉంచుకుని కూడా మాట్లాడడం  లేదు.  ఇప్పటికీ ఊహాగానాలు, అప్పటికి ఏది తోస్తే అది ఆరోపణలు చేయడం సీనియర్ రాజకీయ నేత, మూడు మార్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు గారికి తగునా...


పవన్ జారిపోయాడు :


 ‘ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ల కిందటే చెప్పారు’ అని చేసిన వ్యాఖ్యలపై జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ వివరణ ఇచ్చారు. ఇది తనకు ఎవరో చెప్పింది కాదని... ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వార్తా చానళ్లకు తెలిసిందే తాను చెప్పానని వివరించారు. పాక్‌లో భారత్‌ వైమానిక దాడులు జరిపిన రోజునే (గతనెల 26న) కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పవన్‌ ‘యుద్ధం’ గురించి ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వివాదాస్పదమయ్యాయి. తమ దేశ వాదనను బలపరుచుకునే క్రమంలో పాక్‌ మీడియా కూడా దీనికి ప్రాధాన్యమిచ్చింది.


సర్దుకున్న జనసేనాని :


ఈ క్రమంలో తాజాగా విద్యార్థులు, యువతతో మాట్లాడుతూ పవన్‌ దీనిపై వివరణ ఇచ్చారు. ‘‘యుద్ధం వస్తుందని నాకేం తెలుసు! రెండేళ్ల ముందే నేనెలా చెప్పగలను? పాకిస్థాన్‌ వాళ్లు మాట్లాడుకునేది వింటానా ఏంటి? లేమ్యాన్‌ బ్రదర్స్‌ సంస్థ ఆర్థికంగా కుప్పకూలుతుందని ముందునుంచే అంచనావేసి చెప్పేవారు. అలాగే యుద్ధం వస్తుందని ఊహించేందుకు కొందరి వ్యాఖ్యలే కారణం. నేనూ వాటిని దృష్టిలో ఉంచుకుని చెప్పాను’’ అని పవన్‌ వివరించారు.


బాబు గారు ఏమంటారు :


గత రెండు రోజులుగా పవన్ చెప్పాడంటూ ప్రతీ మీటింగులో ప్రస్తావిస్తూ నానా యాగీ చేసిన చంద్రబాబు ఇపుడేమంటారని కమలనాధులు గట్టిగా నిలదీస్తున్నారు. యుద్ధం వస్తుందని, ఎన్నికల్లో ప్రయోజనం కోసమే బీజేపీ తెస్తోందని, ఓట్ల  కోసం యుద్ధమని బాబు వరసగా  ప్రతీ రోజూ అరోపణలు చేసున్నారు. దానికి పవన్ కామెంట్స్ ని కూడా బాగా వాడుకుంటున్నారు. నిన్నటికి నిన్న  కర్నూల్లో జరిగిన మీటింగులో కూడా బాబు ఇవే మాటలను చెబుతూ మోడీపై బురద జల్లేసారు. మరి పవన్ తనకు ఏ బీజేపీ నేతా చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఇపుడు బాబు వంతు. 
అనవసరంగా నిందలు వేసినందుకు ఏం సమాధానం చెబుతోరని బీజేపీ నేతలు అడుగుతున్నారు.  ఏదీ లేకుండానే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మొన్న విశాఖలో మోడీ అన్న మాటలే ఇపుడు బాబు విమర్శలను చూసి అనుకోవాలంటున్నారు. ఇంతలా దేశ రక్షణ విషయంలో కూడా రాజకీయం చేయడమేంటని కౌంటర్లు పడుతున్నాయి. ఎన్నికలు, రాజకీయాలు ఎలా ఉన్నా దేశ రక్షణ వంటి సున్నితమైన అంశాల్లో బాబు వంటి నాయకులు సహనం పాటించలేరా అని సోషల్ మీడియా అడిగేస్తూంటే  క‌డిగేస్తూంటేబాబు గారు ఏం సమాధానం చెపుతారిపుడు..


మరింత సమాచారం తెలుసుకోండి: