ఐటి గ్రిడ్స్ అనే చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీని అడంపెట్టుకుని లక్షలాది ఓట్లను తీసేస్తున్న విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి అడ్డదిమైన అనైతిక చర్యలకు పాల్డడుతోంది. ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందో అందరి అనుమానాలు చినబాబు నారా లోకేష్ పైనే పడింది. ఐటి శాఖను లోకేష్ పట్టుబట్టి తీసుకున్నది కూడా ఇందుకేనా అన్న అనుమానాలూ పెరిగిపోతున్నాయి.

 

ఏపిలోని 3.7 కోట్ల ఓటర్లకు సంబంధించిన సమస్త వివరాలు ఓ చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ దగ్గర దొరికాయంటే ఏమిటర్ధం ? ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉండాల్సిన వివరాలు ఓ కంపెనీ దగ్గర దొరికిందంటే ప్రభుత్వంలోని ముఖ్యుల హస్తం లేకుండా సాధ్యమేనా ? ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి తమ వివరాలను అందిస్తే ప్రభుత్వమేమో ఆ వివరాలను వేరే కంపెనీ చేతిలో పెట్టింది. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సుంటుదనటంలో సందేహం లేదు. ఎందుకంటే, లోకేషే ఐటి మంత్రి కాబట్టి.

 

ఓట్లు తీసేయటం అన్నది దాదాపు ఏడాది నుండే గోలగా ఉంది. వైసిపికి పడతాయని అనుమానించిన ఓట్లను ఓ క్రమపద్దతిలో అధికార టిడిపి నేతలే ఏరేస్తున్నారు. వివిధ జిల్లాల్లో ట్యాబులు పట్టుకుని కొందరు ప్రతీ ఇంటికి సర్వే చేయటం కూడా ఇదులో భాగమే. సేవామిత్రలని లక్షల సంఖ్యలో  చంద్రబాబు  రంగంలోకి దింపారు. వారు చేసే పనులు కూడా వ్యక్తిగత వివరాలు సేకరించటమే. అంటే ఒకటికి రెండు సార్లు ప్రతీ ఇంటికి తిరిగి పక్కాగా సేకరించిన వివరాలు ముందుపెట్టుకుని తమకు పడవు అని అనుమానం ఉన్న ఓట్లను ఏరేస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఓట్లు పోవటంతో గోల మొదలైపోయింది.

 

తాజాగా బయటపడిన సైబర్ క్రైమ్ తో అందరూ విస్తుపోతున్నారు. సామాజిక కార్యకర్త లోకేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో తెలంగాణా పోలీసులు తీగలాగుతుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు ఉలికిపడుతున్నారు ? మాదాపూర్ లోని ఓ కంపెనీపై పోలీసులు దాడులు చేస్తే వెంటనే ఏపి పోలీసులు అక్కడి ఎందుకు వచ్చారు ? కంపెనీ సిబ్బందిని తెలంగాణా పోలీసులు అరెస్టు చేయబోతే  ఏపి పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు ? కంపెనీ ఓనర్ అశోక్ కు పెద్దబాబు, చినబాబుకు ఉన్న లింకేంటి ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కంపెనీతో చంద్రబాబు, లోకేష్ బంధాలు అన్నీ అర్ధమవుతున్నాయి.

 

అసలింతకీ ఈ పనికిమాలిన పనికి ఎందుకు దిగాల్సొచ్చింది ?  రాబోయే ఎన్నికల్లో మామూలుగా గెలవలేమని వాళ్ళకి కూడా అర్ధమైపోయినట్లుంది. అందుకే ఓట్ల తొలగింపునకు దిగారు. మరో రెండు నెలల్లో ఎన్నికలుండగా హడావుడిగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారంటేనే అర్ధమైపోతోంది చంద్రబాబులో టెన్షన్. ఏమి చేసినా జనాలు ఓట్లేయరని డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే ఓట్ల తొలగింపనే నీచానికి దిగారు. పైగా ఓట్లు తొలగించమంటూ  ఆన్ లైన్లో ఓటర్లే ఎన్నికల కమీషన్ కు లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారట. దీంతోనే అర్ధమవ్వటంలేదూ రాబోయే ఎన్నికల్లో టిడిపి భవిష్యత్తు ?


మరింత సమాచారం తెలుసుకోండి: