పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎపుడేం మాట్లాడుతారో ఎవరికీ తెలియదు అంటారు. కానీ ఆయన కొన్ని నిర్దిష్ట విధానాలతోనే రాజకీయాల్లొకి వచ్చారు. ఆయన రాక వల్ల కొందరు గెలిచి ఉండవచ్చు కానీ కొందరు మాత్రం ఓడిపోతున్నారు. పవన్ రేపటి ఏపీ ఎన్నికల్లో ఏ రకమైన పాత్ర నిర్వహిస్తారన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.


వైఎస్సార్ ఫ్యామిలీ  అంటే :


పవన్ కు వైఎస్సార్ ఫ్యామిలీ అంటే వ్యక్తిగత ద్వేషం లేదని చెబుతున్నా. మొన్న చిత్తూరు మీటింగులో కూడా ఇదే విషయం ఆయన చెప్పారు. కానీ జగన్ మాత్రం సీఎం కావద్దట. ఇదేంటని అడిగితే ఆయనకు ఏపీ ప్రజల ఆత్మాభిమానం కాపాడడం తెలియదు అంటున్నారు. మరి ఏపీ ప్రజల ఆత్మాభిమానం చంద్రబాబు మాత్రం కాపాడుతున్నారా. ఆయనే కదా తొలిసారి ఏపీని రెండు ముక్కలు చేయమని 2008లో అప్పటి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్ ఇచ్చింది. మరి నాలుగేళ్ల కాలంలో విభజన హామీలపై టీడీపీ నోరెత్తకుండా ఏపీ ప్రజలను బీజేపీ ద్రుష్టిలో పలుచన చేసింది. ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని చెప్పి ఏపీ ప్రజల  ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. మరి జగన్ ఏపీ ప్రజల ఆత్మ గౌరవం ఏ విధంగా దెబ్బ తీశారో చెప్పాలని వైసీపీ నేతలు పవన్ని నిలదీస్తున్నారు.


అపుడు ఇలాగే సెటైర్లు :


పవన్ ఈనాడే రాజకీయాల్లోకి రాలేదు. ఆయన తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు కూడా యువరాజ్యం అధినేతగా ఉన్నారు. అప్పట్లో  ఆయన కాంగ్రెస్ నేతలపై మాట్లాడుతూ పంచెలూడగొడతామని గట్టిగా చెప్పుకొచ్చారు. అప్పట్లో పంచెతో ఉన్న సీఎం వైఎస్సార్ మాత్రమే ఆ విధంగా డైరెక్ట్ గా వైఎస్సార్ మీదనే పవన్ తొలిసారి అప్పట్లో అటాక్ చేశారని అంటున్నారు. ఇక పవన్ జనసేనను ప్రారంభించి టీడీపీకి మద్దతుగా నిలవడం వెనక జగన్ అధికారంలోకి రాకుండా నిలువరించడమే ప్రధాన లక్ష్యమని అంతా అంటారు. వైసీపీ నేతలు ఇప్పటికీ దాన్ని విమర్శిస్తారు. 
ఇక జగన్ సీఎం కాకూడదని పవన్ చెప్పడాన్ని కూడా ఇపుడు  వైసీపీ నెతలు తప్పుపడుతున్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు మళ్ళీ రాకూడదని ప్రతిపక్ష నేతగా చెప్పాల్సిన పవన్ ఇలా మరో ప్రతిపక్ష పార్టీ అధినేతని తరచూ విమర్శించడమేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే పవన్ వైఎస్సార్ ఫ్యామిలీని టార్గెట్ చేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ నాటి యువరాజ్యం నేత నుంచి నేటి జనసేన అధినేతగా చూసుకుంటే వైఎస్సార్ ఫ్యామిలీనే టార్గెట్ చేశారని చెబుతున్నారు. మరి పవన్ తీరు చూస్తూంటే మరో మారు టీడీపీకే ఆయన బాసటగా నిలిస్తారని వైసీపీ నేతలు గట్టిగానే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: