అవును తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏపిలోని 3.5 కోట్ల మంది వ్యక్తిగత డేటా  హైదరాబాద్ లోని ఐటి గ్రిడ్ సాఫ్ట్ వేర్ సంస్ధలో దొరికిన విషయంపై కెటియార్ స్పందించారు.  ఏపి ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సాఫ్ట్ వేర్ సంస్ధ దగ్గరకు ఎలా చేరిందో చంద్రబాబునాయుడే చెప్పాలని కెటియార్ డిమాండ్ చేశారు. ఐటి గ్రిడ్ సంస్ధపై  వచ్చిన ఫిర్యాదు ప్రకారమే తెలంగాణా పోలీసులు చర్యలు తీసుకుంటే ఎందుకు ఉలికిపడుతున్నారంటూ కెటియార్ ప్రశ్నకు చంద్రబాబే సమాధానం చెప్పాలి.


ఏ విషయంలో అయినా అడ్డంగా దిరికిపోయిన తర్వాత బుకాయింటం చంద్రబాబుకు అలవాటే అంటూ కెటియార్ ఎద్దేవా చేశారు. నాలుగేళ్ళ క్రితం బయటపడిన ఓటుకునోటు కేసులో కూడా దొరికిపోయి ఇప్పటికీ బుకాయిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ప్రజల వ్యక్తిగత వివరాలు గ్రిడ్ కంపెనీకి ఇచ్చింది చంద్రబాబా ? లేకపోతే లోకేషే ? అన్నది తేలాలన్నారు.

 

తమకందిన ఫిర్యాదుపై తెలంగాణా పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఏపి పోలీసులు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ కెటియార్ ప్రశ్నించారు. తెలంగాణా వ్యవహారాల్లో ఏపి పోలీసుల జోక్యం ఏమిటో తమకు అర్ధం కావటం లేదన్నారు. అసలు ఐటి గ్రిడ్ సంస్ధతో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు, లోకేష్ లు స్పష్టం చేయాలని కెటియార్ డిమాండ్ చేశారు.

 

మొత్తం మీద ఐటి గ్రిడ్ కంపెనీ వ్యవహారాలపై చంద్రబాబు, లోకేష్ అడ్డంగా దిరికిపోయిన మాట వాస్తవం. అందులో నుండి బయటపడేందుకు తండ్రీ, కొడుకులు నానా అవస్తలు పడుతున్నారు. ఆ స్కాంలో నుండి బయటపడేందుకే చంద్రబాబు ఇపుడు బుకాయిస్తున్నారు. ప్రభుత్వం దగ్గరుండాల్సిన ప్రజల వ్యక్తిగత వివరాలు ప్రైవేటు సంస్ధల దగ్గరకు ఎలా చేరిందనే విషయమై చంద్రబాబే సమాధానం చెప్పాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: