క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరో రెండునెలల్లో సాధారణ ఎన్నికలు వస్తున్నాయ్. దాదాపు ఐదేళ్ళ పాలనలో చంద్రబాబునాయుడుపై అన్నీ వైపులా వ్యతిరేకత పెరిగిపోయింది. రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశం లేదన్న విషయం చంద్రబాబుకు అర్ధమైపోయినట్లుంది. అందుకే ఇంతగా దిగజారిపోయారు. ప్రభుత్వం దగ్గరుండాల్సిన ప్రజల వ్యక్తిగత వివరాలు రెండు ప్రైవేటు సంస్ధల దగ్గరకు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు చంద్రబాబు, లోకేషే సమాధానం చెప్పాలి.

 

చేసిన సిగ్గుమాలిన పని బయటపడటంతో ఓట్ల తొలగింపుకు వైసిపినే ప్రయత్నిస్తోందంటూ టిడిపి నేతలు ఎదురుదాడి మొదలుపెట్టింది. టిడిపికి చెందిన 8 లక్షల ఓట్లు ఏరేయటానికి వైసిపి ప్రయత్నిస్తోందంటూ ఎంఎల్ఏ బోండా ఉమ చేసిన తాజా వ్యాఖ్యలే టిడిపి నేతల మానసిక స్ధితికి అద్దం పడుతోంది. ఒక్క కమ్మ సామాజికవర్గం తప్ప మిగిలిన సామాజికవర్గాల్లో మెజారిటీ సెక్షన్  చంద్రబాబంటే మండిపోతున్నాయి. అదేసమయంలో పెరిగిపోయిన అవినీతి, దారితప్పిన లా అండ్ ఆర్డర్, పోటీకి వెనకాడుతున్న ఎంపిలు, ఎంఎల్ఏలు వెరసి గెలుపుపై నమ్మకం కోల్పోయినట్లున్నారు.

 

రేపటి ఎన్నికల్లో ఓడిపోతే భవిష్యత్ ఎంత భయంకరంగా ఉంటుందో చంద్రబాబు, చినబాబు ఊహించుకున్నట్లున్నారు. అందుకనే మాయచేసో, మంత్రమేసో లేకపోతే మోసం చేసైనా సరే మళ్ళీ అధికారంలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. అందుకనే వైసిపి ఓట్ల తొలగింపనే సిగ్గుమాలిన పనికి దిగజారిపోయారు.

 

చేస్తున్న సిగ్గుమాలిన పని బయటపడేసరికి ఎదురుదాడి చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీపై తెలంగాణా పోలీసులు దాడి చేస్తే చంద్రబాబు ఎందుకు ఉలికిపడుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇక్కడే ఐటి గ్రిడ్ సాఫ్ట్ వేర్ కంపెనీకి చంద్రబాబు, లోకేష్ మధ్య ఫెవికాల్ బంధం బయటపడుతోంది.  

 

విషయం ఏదైనాసరే అడ్డంగా దొరికిన తర్వాత బుకాయించటం బయటపడేందుకు ఆందోళనలకు పిలుపివ్వటం మామూలైపోయింది చంద్రబాబుకు. తాజాగా చంద్రబాబు అదే పనిచేశారు. వైసిపి ఓట్లను తొలగించేందుకు ఐటి గ్రిడ్ సాఫ్ట్ వేర్ కంపెనీ, బ్లూ ఫ్రాగ్ మొబైల్ టాక్నాలజీ అనే కంపెనీకి కోట్లాదిమంది ప్రజల వ్యక్తిగత వివరాలను ఇచ్చిన విషయం బయటపడేటప్పటికి ఆందోళనలు చేయమని చంద్రబాబే పిలుపివ్వటం విచిత్రంగా ఉంది. వైసిపి అనైతిక చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని చంద్రబాబు పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: