ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓట్ల గల్లంతు విషయం ఒక్కొ నిజాలు బయటకు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు ఈరోజు హైకోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. తమ సంస్థకు చెందిన నలుగురు ఐటి ఉద్యోగులు కనిపించడం లేదని ఐటీ గ్రిడ్ లో పనిచేస్తున్న అశోక్ అనే ఉద్యోగి నిన్న హైకోర్టును ఆశ్రయించి విషయం తెలిసిందే. 

రెండు రోజులూ వరుస సెలవులు ఉండటంతో అత్యవసరంగా ఇంటివద్దే విచారించాలని కోరారు. దానికి అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ నలుగురు ఉద్యోగులు ఫణి, భాస్కర్, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ లను తమముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు.

ఈ నేపథ్యంలో సోమవారం నాడు సైబరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న నలుగురు ఉద్యోగులను కుందన్ బాగ్‌లోని హైకోర్టు జడ్జి ఎదుట సైబరాబాద్ పోలీసులు హాజరుపర్చారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల సమాచారాన్ని సేకరించిందని లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సైబారాబాద్ పోలీసులు ఈ కేసును  విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: