Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 7:24 am IST

Menu &Sections

Search

ఈ కేసులో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలే ప్రసక్తే లేదు : సైబరాబాద్ సీపీ సజ్జనార్

ఈ కేసులో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలే ప్రసక్తే లేదు : సైబరాబాద్ సీపీ సజ్జనార్
ఈ కేసులో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలే ప్రసక్తే లేదు : సైబరాబాద్ సీపీ సజ్జనార్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సేవా మిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు.  ఐటి గ్రిడ్ ద్వారా ఓటర్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో సమాచారం తెలుసుకుంటున్నారు. ట్యాబ్, సీపీయూలు స్వాధీనం చేసుకున్నాం.  ఐటి గ్రిడ్ లో సేకరించిన వివరాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాం. ఐటి గ్రిడ్ అధినేత అశోక్ పై ఐపీసీ సెక్షన్ 420,419,468,120 కింద కేసు నమోదు. అశోక్ కోసం గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.  వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినయోగం చేస్తున్నారని తేలింది. విచారణలో భాగంగా అమెజాన్ సర్విస్ కు కూడా నోటీసులు అందించారు.  ఐటి గ్రిడ్ కి సంబంధించిన డేటాను అమెజాన్ లో భద్రపరుస్తున్నట్లు తేలింది. 

 ఓటరు తొలగింపుపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. విచారణలో కీలకమైన ఆధారాలు సేకరించాం.  ఆధార్ సంస్థతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశాం.  సేవా మిత్ర యాప్ కార్యకలాపాలపై విచారణ చేస్తాం అని అన్నారు సీపీ సజ్జనార్.  ఐటి గ్రిడ్ కార్యాలయాల్లో సోదాలు చేసి సమాచారం సేకరిస్తాం. ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు ఈ కేసులో ముందుకు వెళ్తాం.

ఈ కేసులో కీలకమైన నలుగురు ఉద్యోగులను విచారించాం.  డేటా ఆంధ్ర ప్రజలది..కానీ కంపెనీ హైదరాబాద్ లో ఉంది.  అవసరమైతే ఎంత పెద్దవారినైనా ఈ కేసులో అరెస్ట్ చేసేఅవకాశం ఉంది. ఎన్నాళ్ల నుంచి డేటా వారి దగ్గర ఉందో దర్యాప్తులో తేలిపోతుంది. సంక్షేమ పథకాల లబ్దిదారుల డేటా ఎందుకు ఉంచుకున్నారో ప్రశ్నిస్తాం. లబ్దిదారుల డేటా ఎలా తెచ్చారో దర్యాప్తులో తేలుతుంది. అశోక్ లొంగిపోయాకే సేవా మిత్ర యాప్ వివరాలన్నీ తెలుస్తాయి. డేటా హైదరాబాద్ లో దొరికింది కాబట్టే ఇక్కడే దర్యాప్తు చేస్తాం.

ఈ కేసులో సంబంధం ఉన్నవాళ్లు ఎవరినైనా పిలుస్తాం. ఈ డేటాతో ఎవరినైనా వ్యక్తిగతంగా బ్లాక్ మెయిల్ చేయవచ్చు.  తమ కంపెనీలో సోదాలు జరిగితే అశోక్  ఎక్కడ ఉన్నారు? ఈ కేసు వెనుక ఎవరు ఉన్నారో వివరాలు సేకరిస్తున్నాం. ఓటర్ల వివరాలు ఎందుకు దగ్గర ఉంచుకున్నారో దర్యాప్తు చేస్తున్నాం. ఐటి గ్రిడ్ కేసులో అశోక్ ను ప్రధాన నింధితుడిగా గుర్తించాం. 


andhrapradesh-talangana-ig-grid-cyberabad-police-c
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.